సునీల్‌తో డింపుల్‌ చిందులు

Update: 2015-03-18 07:30 GMT
డింపుల్‌ చోపడే.. అప్‌కమింగ్‌ సౌత్‌స్టార్‌. కోలీవుడ్‌, టాలీవుడ్‌కి సుపరిచితం. తెలుగులో రొమాన్స్‌ చిత్రంతో తొలి అడుగులు వేసింది. ఆ సినిమా ఫ్లాపైనా అమ్మడిలోని వాడి వేడి తెలుగు కుర్రకారుకు నచ్చింది. అందుకే ఇప్పుడు తుంగభద్ర సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు కుర్రాడు ఆధిత్‌ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు.

అలాగే డింపుల్‌ ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేసింది. వాసువర్మ దర్శకుడిగా అగ్రనిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో అవకాశం అందుకుంది. సునీల్‌ సరసన నాయికగా ఎంపికైంది. ఇదే సినిమాలో కథానాయిక సంజన సోదరి నిక్కీ ఒక కథానాయికగా నటిస్తోంది. సునీల్‌ అంటేనే డ్యాన్సింగ్‌ స్టార్‌. అతడి స్టెప్పులకు ధీటుగా డింపుల్‌ చిందేయాల్సిందే. డ్యాన్సుల్లో స్పీడ్‌ పెంచాల్సిందే. లేదంటే అతడిని ఢీకొట్టడం కష్టం.

అమ్మడిలో యూత్‌ఫుల్‌ అప్పియరెన్స్‌ ఉంది. ఆకర్షణ ఉంది. సునీల్‌ సరసన సరిజోడుగానే కనిపిస్తుంది. కాబట్టి అమ్మడికి స్ట్రెయిట్‌ సినిమాతో విజయం వస్తుందనే ఆశిద్దాం. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయితే వరుసగా మరిన్ని సినిమాలకు ఛాన్సుంటుంది.
Tags:    

Similar News