మ‌హిళా పాత్ర‌లపై డింపుల్ కీల‌క వ్యాఖ్య‌లు!

Update: 2022-10-31 09:30 GMT
విజయవాడ బ్యూటీ డింపుల్ హయతి 'ఖిలాడీ' తో మ‌రింత ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమా ప్లాప్ అయినా యంగ్ బ్యూటీకిది భారీ అవ‌కాశం కావ‌డంతో నెట్టింట అనూహ్య‌మైన‌ పాపులారిటీని తెచ్చిపెట్టింది. 'గల్ఫ్' అనే ఓ చిన్న చిత్రంతో నటిగా పరిచయమైన డింపుల్ హయతి కెరీర్ లో వేగంగా అగ్ర హీరోలతో అవకాశాలు అందుకుంది.  దుచూనా ్లోఒ్ఉ ల‌మేఎఒ ఈఏచాయ‌

కోలీవుడ్ లో కార్తీ..విశాల్..ధ‌నుష్  లాంటి స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుంది. కానీ సక్సెస్ ల పరంగా వెనుకబడే ఉంది. 'ఖిలాడీ' పై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ అడియాశ‌లుగానే మిగిలిపోయాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో ఘోరంగా ఫెయిలైంది. తాజాగా డింపుల్ మ‌హిళ‌ల్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సినిమా-స‌మాజాన్ని రెండిటినీ లింక్ చేసి వ్యాఖ్యానించింది.

'సినిమాల్లోనే కాదు సమాజంలో కూడా అలాగే ఉంది. ప్రపంచం మొత్తం స్త్రీలు - పురుషుల చుట్టూ తిరుగుతోంది. మ‌హిళ పాత్ర స‌మాజంలో ఎంతో ప్ర‌భావితంగా క‌నిపిస్తుంది. సినిమాల్లోనూ మ‌హిళ‌ల పాత్ర‌లు అలాగే ఉంటాయి. నిజ జీవితంలో జ‌రిగిన వాస్త‌వాలు చాలా వ‌ర‌కూ సినిమాల్లోనూ ఉంటాయి.  అందుకే ఒక వ్యక్తి ఆడపిల్ల కోసం పోరాడే ప్లాట్లు సినిమాల్లో కూడా స‌హ‌జంగా క‌నిపిస్తాయి.

ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల శైలి మారాలన్నారు. సినిమాల్లో పురుషు ప్రేమ‌ని హైలైట్ చేస్తున్నారుగానీ...స్ర్తీ పాత్ర‌ని  బ‌లంగా మ‌ల‌చ‌డం లేదు. అన్ని విష‌యాల్లో ముఖ్యంగా ప్రేమ పంచ‌డంలో పురుషుల‌తో స‌మానంగా స్ర్తీలు పంచ‌గ‌ల‌ర‌ని చెప్ప‌గ‌ల‌గాలి.

అలాంటి ప్ర‌య‌త్నాలు సినిమా రూపంలో బ‌లంగా రావ‌డం లేదు. రియ‌ల్ లైఫ్ లో జ‌రుగుతోన్న వాటిని తెర‌పైకి తీసుకురావ‌డం లేదు. మ‌హిళలో స‌హ‌జత్వం.. ప్రేమ‌ని ఇంకా బ‌లంగా చెప్ప‌గ‌ల‌గాలి. స్ర్తీ క‌థ‌ల్ని నిర్మాత‌లు మ‌రింత ప్రోత్స‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది' అన్నారు.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ  గోపీచంద్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంది. దీనికి శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అమ్మ‌డు ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. చేతిలో ఉన్న ఒకే ఒక్క అవ‌కాశం ఇది.  గెలుపు కోసం శ్ర‌మిస్తోంది. స‌క్సెస్ తో  తెలుగులో బిజీ హీరోయిన్ గా ట‌ర్న్ తీసుకోవాల‌ని ఆశ‌ప‌డుతోంది. మ‌రి అమ్మ‌డి టైమ్ ఎలా ఉందో?  చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News