బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. వందల కోట్ల వసూళ్లను సినిమా రాబడుతుందని అంతా భావించారు. కానీ సినిమా కలెక్షన్స్ యూనిట్ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా షాక్ అన్నట్లుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కనీసం వంద కోట్ల వసూళ్లను రాబట్టలేక పోవడంతో బాక్సాఫీస్ వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సినిమా ఫ్లాప్ కి కారణం దర్శకుడు అద్వైత్ చందన్ అంటూ ఆమిర్ ఖాన్ కోపంగా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని... లాల్ సింగ్ చడ్డా సినిమా ఫ్లాప్ దర్శకుడిపై ఆమిర్ మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయమై దర్శకుడు అద్వైత్ క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరి మద్య ఎలాంటి గొడవలు లేవు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే విధంగా ఫోటోను షేర్ చేశాడు. ఆమిర్ ఖాన్ తో ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా తమ ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతుందని చెప్పకనే చెప్పాడు. తమ స్నేహం మామూలు స్నేహం కాదు అంటూ కొన్ని ఉదాహరణలు కూడా ఆయన ఇచ్చాడు.
జీనీ - అలాడిన్... బాలు - మోగ్లీ.... అమర్ - ప్రేమ్ ల మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో తమ మధ్య ఉన్న అనుబంధం మరియు స్నేహం అలాంటిదే అంటూ దర్శకుడు అద్వైత్ పేర్కొన్నాడు. మరి ఈ గొడవ విషయమై ఆమిర్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఒక్క వైపు నుండి క్లారిటీ వచ్చినంత మాత్రాన గొడవలు లేవని అనుకోలేం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొందరిలో గొడవల విషయమై అనుమానాలు కొనసాగుతున్నట్లుగానే అనిపస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.