కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ లో లాంచ్ అవడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది హీరోలు టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో కలిసి భారీ ప్రణాళికలతో రెడీగా ఉన్నారు. దనుష్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె.నారంగ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ముందుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇటీవలే కమ్ములా `లవ్ స్టోరీ`తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకోవడంతో ధనుష్ కి ఈ ప్రాజెక్టుపై కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది. అలాగే దళపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లాంచ్ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది.
ప్రస్తుతం వంశీ ఆ సినిమా పనుల్లోనే తలమునకలై ఉన్నారు. ఇంకా కార్తీ..సూర్య లాంటి హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు తెలుగు హీరోల మాదిరిగానే టాలీవుడ్ లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి మరో హీరో కూడా టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా `జాతిరత్నాలు` ఫేం అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇది అనుదీప్ కి రెండవ చిత్రం కావడం విశేషం. జాతిరత్నాలు చిత్రంతో అనుదీప్ కి దర్శకుడిగా మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే.
ఆ నమ్మకంతోనే శివ కార్తికేయన్ కోసం అనుదీప్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా నారాయణదాస్ నారంగ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. తెలుగు..తమిళ్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇలా ఏక కాలంలో నారాయణ దాస్ నారంగ్ వరుసగా కోలీవుడ్ స్టార్లని టాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతలు తీసుకోవడం విశేషం. తెలుగు యువహీరోలకు ఈ భారీ చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. `లవ్ స్టోరీ` నిర్మాణంలో నారాయణదాస్ నారంగ్ మెజారిటీ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి లాభాలు వచ్చాయని ప్రచారమైంది. ఇక చక్కని కామెడీ టైమింగ్.. రొమాంటిక్ ఫీల్ .. ఎమోషన్స్ తో సినిమాని తీసి సక్సెస్ చూపించే ప్రతిభ అనుదీప్ కి ఉంది. అందుకే శివకార్తికేయన్ లాంటి పెద్ద హీరోతో అతడి ప్రయత్నం ఎలా ఉండనుంది? అన్నది ఆసక్తిని పెంచుతోంది.