ఈమద్య కాలంలో సెలబ్రెటీలు ఏదైనా విషయమై సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడం వారు వెంటనే రెస్పాండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హరీష్ శంకర్ తనకు ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులను మరియు జీహెచ్ ఎంసీ అధికారులను ట్యాగ్ చేయడం జరిగింది. హరీష్ శంకర్ ట్వీట్ కు నిమిషాల్లో స్పందించిన పోలీసులు పెట్రోలింగ్ వెయికిల్ ను పంపించి ఆ సమస్యను పరిష్కరించారట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరీష్ శంకర్ జూబ్లీ ఎన్ క్లేవ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అర్థరాత్రి సమయంలో నిర్మాణాలు జరుగుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్న కారణంగా రాత్రి సమయంలో స్థానికులకు ఇబ్బందిగా ఉందట. అదే విషయాన్ని జూబ్లీ ఎన్ క్లేవ్ రెసిడెన్సీ జనాల తరపున పోలీసులకు హరీష్ శంకర్ ఫిర్యాదు ఇచ్చాడు.
హరీష్ శంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించారు. ఆ విషయమై మళ్లీ మాట్లాడుతూ ఆశ్చర్యంగా ఉంది.. ఇంత త్వరగా సమస్య పరిష్కారం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఏమైనా సాధ్యమే అని మరోసారి నిరూపించారంటూ ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు. పోలీసులు వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపించడంతో వారిపై మరింత గౌరవం పెరిగిందంటూ చెప్పుకొచ్చాడు.