డైరీస్ మేజిక్ రిపీట్ చేస్తావా దాసూ ?

Update: 2019-05-25 07:49 GMT
ఈ నెల 31న విడుదల కానున్న ఫలక్ నుమా దాస్ మీద యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ అండగా నిలవడంతో రిలీజ్ కూడా భారీగానే ఉండబోతోంది. ట్రైలర్ లో కంటెంట్ మరీ బోల్డ్ గా ఉందన్న కామెంట్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు అదే ఓపెనింగ్స్ కి కీలకంగా మారుతోంది. ఇది రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అంగమ్యాలి డైరీస్ ని ఆధారంగా తీసుకుని రూపొందించారు.

అయితే కథలో మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేశామని ఒరిజినల్ చూసినవాళ్లు సైతం సెకండ్ హాఫ్ లో చాలా కొత్తగా ఫీలవుతారని దర్శకుడు కం హీరో విశ్వక్ సేన్ గతంలోనే పలుమార్లు ప్రత్యేకంగా చెప్పాడు. అయితే ఆ ఫ్లేవర్ ని చెడగొట్టకుండా ఎలా డీల్ ఛేసిండొచ్చు అనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది

అంగమ్యాలి డైరీస్ రాగా బోల్డ్ గా సాగే గ్యాంగ్ వార్ స్టోరీ. ఒరిజినల్ వెర్షన్ లో చాలా విశేషాలు ఉన్నాయి. ఒకేసారి 86 డెబ్యూ నటులను పరిచయం చేసిన సినిమాగా ఓ రికార్డు సృష్టించింది. అంతే కాదు 1000 ఆర్టిస్టులతో ఏకధాటిగా 11 నిమిషాల పాటు సాగే అన్ కట్ క్లైమాక్స్ సీన్ మెయిన్ హై లైట్ గా నిలిచింది. అందులో హీరో గ్యాంగ్ పందుల మాంసం బిజినెస్ లో ఉన్నట్టు చూపిస్తే మనవాళ్ళు నేటివిటీ కోసం దాన్ని గొర్రెల బ్యాక్ డ్రాప్ లోకి మార్చారు.

ఇక్కడ పేర్కొన్న హై లైట్స్ అన్ని ఫలక్ నుమా దాస్ లో ఉన్నాయా లేక విశ్వక్ అన్నట్టు వీటిని మార్పులకు గురి చేశారా అనేది విడుదల అయ్యాకే తెలుస్తుంది. యూనిట్ అయితే ఇది ఒక ట్రెండ్ కు దారి తీస్తుందని చెబుతున్నారు. కేరళ డైరీలు తెలుగులో ఎలా మార్చి రాశారో తెలియాలంటే నెలాఖరుదాకా ఆగాల్సిందే. కాస్త బూతుల మోతాదు ఎక్కువగానే ఉన్నప్పటికీ అది కథ డిమాండ్ మేరకే అని చెబుతున్న దర్శకుడి వెర్షన్ లో నిజమెంతుందో తేలేది కూడా ఆరోజే.


Tags:    

Similar News