'ఆచార్య' లో అలాంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్న కొరటాల..!

Update: 2021-07-16 13:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలోని కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి - చరణ్ నక్సలైట్లుగా కనిపించనున్నారు. కొరటాల తన గత చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా సామాజిక అంశాల‌కు తనదైన శైలిలో క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడిస్తున్నారు.

అంతేకాదు కొరటాల 'ఆచార్య' సినిమాతో పొలిటికల్ సిస్టమ్ పై సెటైర్లు కూడా వేస్తున్నారని టాక్. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి.. రాజకీయ నాయకులు సమాజాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారు అనే అంశాలని ఇందులో ప్రస్తావించబోతున్నారట. అలానే తండ్రీకొడుకులు చిరు - చరణ్ నటించే సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకొని.. యాక్షన్ సీన్స్ కు సంగీతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారట. 'ధర్మస్థలి' సెట్ లో తీసిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో మరో బ్లాక్ బస్టర్ కంఫర్మ్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన 'ఆచార్య' షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తవ్వగా.. ఈ షెడ్యూల్ లో పెండింగ్ వర్క్ ని కంప్లీట్ చేయనున్నారు. త్వరలోనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కనిపించనుంది. రెజీనా కసండ్రా ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది.

'ఆచార్య' చిత్రానికి సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. 'స్టాలిన్' తర్వాత చిరంజీవి - మణిశర్మ కాంబోలో వస్తున్న సినిమా ఇది. తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడగా.. తదుపరి బెస్ట్ సీజన్ దసరా బరిలో 'ఆచార్య' చిత్రాన్ని నిలపాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News