చర్చల్లో మృణాల్ కానీ ఆఫర్లు మాత్రం..!

రెండు హిట్ సినిమాలు ఇచ్చాక మృణాల్ పేరు మారుమోగింది. ఐతే ఆ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది అమ్మడు.;

Update: 2025-03-01 01:30 GMT

బాలీవుడ్ లో దశాబ్ద కాలంగా సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కి అక్కడ అనుకున్నంత క్రేజ్ రాలేదు కానీ తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో అమ్మడు స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. సీతారామం సినిమా లో మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో అమ్మడు ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత హాయ్ నాన్న కూడా అమ్మడి ఖాతాలో హిట్ సినిమాగా నిలిచింది. రెండు హిట్ సినిమాలు ఇచ్చాక మృణాల్ పేరు మారుమోగింది. ఐతే ఆ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది అమ్మడు.

ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో అమ్మడికి మొదటి షాక్ తగిలింది. తెలుగులో అమ్మడు చేసిన మొదటి రెండు సినిమాలు హిట్ పడగా థర్డ్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఐతే సినిమా ఫ్లాప్ అయినా ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ తన నటనతో ఆకట్టుకుంది. ఐతే మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత ఆఫర్లు రాకుండా పోయాయి. ఆ సినిమా ఈ సినిమా అంటూ మృణాల్ పేరు డిస్కషన్ లో ఉంటుంది కానీ అఫీషియల్ గా ఓకే అవ్వట్లేదు.

టాలీవుడ్ లో అమ్మడి పరిస్థితి ఇలా ఉంది కానీ బాలీవుడ్ లో మాత్రం మృణాల్ వరుస అవకాశాలు అందుకుంటుంది. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హిందీలో పూజా మేరి జాన్, హే జవాని తో ఇష్క్ హోనా హై, తుం హో తో, సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే మృణాల్ అక్కడ బిజీ బిజీ కానుంది. మరోపక్క తెలుగులో అమ్మడు అడివి శేష్ తో డకాయిట్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగులో అమ్మడు మరోసారి సత్తా చాటాలని చూస్తుంది.

టాలీవుడ్ లో ప్రతి సినిమాలో మృణాల్ పేరు చర్చల్లో ఉంటుంది. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ నటిస్తుందని అంటున్నారు. కానీ అఫీషియల్ గా చెప్పలేదు. ఇలా మృణాల్ గురించి ప్రతిసారి చర్చ జరుగుతుంది కానీ ఏ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వట్లేదు. మరి మృణాల్ కాదంటుందా లేక ఆమెను కేవలం డిస్కషన్స్ లోనే ఉంచుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News