టీ కాఫీ టైమ్ కే బేబమ్మ పలకరింపు..!
ఇది అందరి కెరీర్ లో జరిగేదే కానీ అలా వచ్చిన అవకాశాల్లో తమ కెరీర్ కు ప్లస్ అయ్యే ప్రాజెక్ట్ లు గుర్తించి చేయడంలోనే హీరోయిన్స్ క్లవర్ నెస్ తెలుస్తుంది
ఎవరికైనా తొలి సినిమా హిట్ పడితే ఆ క్రేజ్ తో వరుస సినిమా ఛాన్స్ లు అందుకుంటారు. ఇది అందరి కెరీర్ లో జరిగేదే కానీ అలా వచ్చిన అవకాశాల్లో తమ కెరీర్ కు ప్లస్ అయ్యే ప్రాజెక్ట్ లు గుర్తించి చేయడంలోనే హీరోయిన్స్ క్లవర్ నెస్ తెలుస్తుంది. ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా తో యూత్ ఆడియన్స్ లో ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఐతే ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస ఐదారు సినిమాలు చేసింది. అన్ని మంచి కాంబినేషన్సే అయినా అమ్మడికి కాలం కలిసి రాలేదు.
కట్ చేస్తే అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి కెరీర్ రిస్క్ లో పడింది. లాస్ట్ ఇయర్ చివరగా మనమే సినిమా చేయగా అది కూడా నిరాశపరిచింది. అందుకే కృతి శెట్టికి తెలుగులో ఆఫర్లు రావట్లేదు. ఐతే ఈ మధ్యనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అక్కడ టోవినో థామస్ తో సినిమా చేసింది. ఇక ఇప్పుడు తమిళ్ లో రెండు మూడు సినిమాలు చేస్తుంది.
ఐతే తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న అమ్మడు ఇక్కడ మాత్రం ఛాన్స్ లు అందుకోవట్లేదు. ఇక సినిమాలు లేకపోయినా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో వరుస ఫోటో షూట్స్ చేస్తుంది కృతి శెట్టి. లేటెస్ట్ గా టీ లేదా కాఫీ అంటూ ఒక ఫోటో షూట్ చేసింది. ఆడియన్స్ కి టచ్ లో ఉండేందుకు టీ, కాఫీ టైం లోనే అమ్మడు పలకరిస్తుంది. ఈమధ్య ఫోటో షూట్స్ విషయంలో కూడా ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది అమ్మడు.
మొదట్లో ఫోటో షూట్స్ ని కూడా చాలా నీట్ గా చేస్తూ వచ్చిన కృతి శెట్టి ఛాన్స్ లు రావట్లేదు కదా అని ఈమధ్య గ్లామర్ షో కూడా మొదలు పెట్టింది. బేబమ్మ ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేయడం చూసిన ఆడియన్స్ మాత్రం థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఇక ఫైనల్ గా కెరీర్ లో మరో ఉప్పెన లాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టికి అలాంటి సినిమా ఎప్పుడు పడుతుందా అన్నది చూడాలి. బేబమ్మని ఇష్టపడుతున్న ఆడియన్స్ కూడా అమ్మడికి ఒక హిట్ పడితే బాగుంటుందని అనుకుంటున్నారు.