యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సర్ ప్రైజ్ మొత్తానికి ఒక రోజు ముందుగానే వచ్చేసింది. 'ట్రిపుల్ ఆర్' తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో చేయబోతున్న విషయం తెలిసిందే. తను చేసిన 'ఆచార్య' డిజాస్టర్ గా నిలవడంతో కొంత భయాందోళనకు గురైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో వచ్చి 'జనతా గ్యారేజ్' ని దృష్టిలో పెట్టుకుని ఈ దఫా ఎన్టీఆర్ తో కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ ని అందించడం గ్యారెంటీ అని గట్టి నమ్మకానికి వచ్చారట.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రకటన వస్తుందా? అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు తన పుట్టిన రోజు కు ముందు 30వ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో తో పాటు పవర్ ఫుల్ డైలాగ్ లని కూడా వదిలి సర్ ప్రైజ్ చేశారు. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. 'ఫ్యూరీ ఆఫ్ #NTR30' అంటూ విడుదల చేసిన మోషన్ పోస్టర్ భారీతో అంచనాల్ని పెంచేశారు.
ఇక మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ ని చూపించిన తీరు, పలికిన సంభాషణలు కూడా సినిమా ఓ రేంజ్ లో వుంటుందనే సంకేతాల్ని అందించేసింది. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో ఈ మూవీ సాగేలా కనిపిస్తోంది. చేతిలో ఆయుధాలతో సముద్రం, లైట్ హౌస్, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు మొత్తానికి సెటప్ ఆసక్తికరంగా వుంది. ఎన్టీఆర్ నుంచి ఆడియన్స్ మాస్ జాతర లాంటి సినిమాని కోరుకుంటున్నారు. కొరటాల శివ అదే తరహా సినిమాని అందించబోతున్నట్టుగా మోషన్ పోస్టర్ పక్కా క్లారిటీ ఇచ్చేసింది.
అయితే గతంలో అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ ఇదే థీమ్ తో ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కూడా ఎన్టీఆర్ మూవీని నిర్మిస్తున్న సుధాకర్ మిక్కిలినేనినే. ఆ సినిమా కథలో బన్నీ మార్పులు చెప్పడం, కొరటాల శివ అందుకు అంగీకరించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పడు అదే ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. బన్నీతో చేయబోయే సినిమా ఖచ్చితంగా వుంటుందని ఇటీవల 'ఆచార్య' ప్రమోషన్స్ లో మరీ మరీ చెప్పారు కొరటాల శివ.
అంతే కాకుండా ఈ మూవీని స్టూడెంట్స్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరపైకి తీసుకురాబోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ స్టూడెంట్స్ పాత్ర ఎంతో వుంది. అదే అంశాన్ని తెరపై చూపిస్తూ ఓ యువ లీడర్ దేశ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించాడనే కథాంశంలో ఈ మూవీని రూపొందించబోతున్నారట. 'పుష్ప 2' తరువాత బన్నీతో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే కొరటాల - ఎన్టీఆర్ - బన్నీ..అది అదే ఇది ఇదే అన్నమాట.