అసలు స్నేహితుడు అంటే ఎవరో డిఫైన్ చేయగలరా? గొప్ప స్నేహితుడు ఎలా ఉండాలి?.. చెప్పగలరా..ఎవరైనా? ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం కావాలంటే దర్శకుడు క్రిష్‌ని అడగాల్సిందే. స్నేహంలోని ఔన్నత్యంపై `గమ్యం` చిత్రంలో అద్భుతంగా చూపించారు గ్రేట్ డైరెక్టర్ క్రిష్. అందుకే ఆయన తనదైన శైలిలో స్నేహితుడు గురించి ఓ మాట చెప్పాడు. ఇంతకీ ఎవరా స్నేహితుడు? అంటే.. మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన పందెంకోడి 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో క్రిష్ మాట్లాడుతూ గ్రేట్ ఫ్రెండు అంటే విశాల్! అని అన్నారు. అందుకు సహేతుక కారణం కూడా చెప్పారు. క్రిష్ మాట్లాడుతూ - ``గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్ అని చెప్పొచ్చు. నేను తనకు వీరాభిమానిని. పొల్లాచ్చిలో `కృష్ణం వందే జగద్గురుమ్` రెక్కీకి వెళ్లినప్పుడు అక్కడ ఓ సమస్య ఎదురైంది. అక్కడ యూనిట్ సభ్యలతో రూమ్స్ ఫుల్ అయిపోయాయి. నాకు ఒక రూమ్ కూడా లేదు. కారులోనే పడుకుందామని డిసైడయ్యాను. కానీ ఆ టైమ్‌లో అక్కడే ఉన్న విశాల్ నన్ను చూసి తన రూమ్‌కి తీసుకెళ్లాడు. సుందర్ సితో సినిమా చేస్తున్నాడపుడు. తన బెడ్ నాకు ఇచ్చేసి నేలపై పడుకున్నాడు. పురట్చి దళపతి (విప్లవ సేనా నాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరుతో పిలుపు అందుకోవడాకి విశాల్‌కు అర్హత ఉంది. విశాల్ గొప్ప పర్సనాలిటీ. మంచి సహృదం ఉన్న వ్యక్తి`` అని అన్నారు. పందెంకోడి కంటే పెద్ద విజయం అందుకుంటాడు సీక్వెల్‌తో అని కితాబిచ్చారు క్రిష్.
క్రిష్ చెప్పినట్టు విశాల్‌లోని గట్స్ గురించి కేవలం తమిళ అభిమానులే కాదు, తెలుగు అభిమానులు అంతే ఇదిగా మాట్లాడుకుంటారు. అతడు రియల్ లైఫ్ హీరో తరహా. బిగ్ ఛాలెంజర్. దక్షిణాదిన ఉన్న రైతుల తరపున వకాల్తా పుచ్చుకున్న మంచి మనిషి. మేధావి. జీవితంలో ఒక్కడైనా అలాంటి ఫ్రెండును ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. సాయంత్రం బీర్ పార్టీలో కనిపించి, డబ్బులన్నీ ఖర్చయ్యాక వీడేం ఫ్రెండురా? అనే బేవార్స్ బ్యాచ్‌లతో పోలిస్తే, స్నేహానికి విలువనిచ్చే, స్నేహం ఔన్నత్యాన్ని పెంచే విశాల్ లాంటి ఒక్క ఫ్రెండునైనా సంపాదించుకోవాలి. ఇది అందరూ నేర్వాల్సిన పాఠం.