ఎక్స్ క్లూజివ్: క్రిష్ పెళ్లి ముహూర్తం ఇదే..

Update: 2016-06-25 12:25 GMT
దర్శకుడు క్రిష్ కి ఇప్పుడు లైఫ్ లోనే బెస్ట్ ఫేజ్ నడుస్తోందని చెప్పాలి. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ తీయడమే కాదు.. నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ తో తొలిసారిగా జత కడుతున్నాడు. ఇప్పటివరకూ ఓ స్టార్ హీరోతో సోలోగా సినిమా తీయడం క్రిష్ కి ఇదే మొదటిసారి. ఎలాగైనా బాలయ్య వందో సినిమాని సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉన్న క్రిష్.. ఇటు పర్సనల్ లైఫ్ లో కూడా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ - డాక్టర్ రమ్యల వివాహానికి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి పెళ్లి ముహూర్తం డీటైల్స్ ను.. తుపాకి.కాం మీకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 8వ తేదీన తెల్లవారు జాము 2.28కి(7వతేదీ అర్ధరాత్రి) పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. హైద్రాబాద్ లోనే క్రిష్ వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ వేడుక జరిపేందుకు నిర్ణయించారు.

 తాజాగా జరిగిన ఎంగేజ్మెంట్ వేడుక కూడా ఓ స్టార్ హోటల్ లోనే జరిగింది. అటు ప్రొఫెషనల్ గాను... ఇటు పర్సనల్ గాను ఒకసారి కీలక నిర్ణయాలు తీసుకుని బెస్ట్ ఫేజ్ లోకి వెళ్లే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ రెండింటినీ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే ట్యాలెంట్ క్రిష్ కి బోలెడంత ఉంది అంటూ ప్రశంసలు, అభినందనలు కురిపిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.
Tags:    

Similar News