ఎంటర్టైన్మెంట్ తో కూడిన సందేశాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్. తన కేరీర్ కోసం ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉన్నా.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో సంబరాలకు తెరతీశారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రమ్యతో క్రిష్ పెళ్లి త్వరలో జరగబోతోంది. పెద్దల అనుమతితో నిశ్చయింపబడిన ఈ వివాహానికి ఆగస్టు 8, తెల్లవారుఝామున 2:28 నిమిషాలకు సుముహూర్తంగా నిర్ణయించారు. మొదట్లో వీరిదీ ప్రేమ వివాహం అని వార్తలు వచ్చినా.. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనట.
ప్రస్తుతం పెళ్లికోసం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన క్రిష్, పెళ్లిపనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ వివాహానికి హైదరాబాద్ గండిపేట దగ్గరలోని గోల్కొండ రిసార్ట్ వేదికకాబోతుంది. కొద్ది రోజుల ముందు జరిగిన క్రిష్ - రమ్య ల నిశ్చితార్ధానికి బాలకృష్ణ దంపతులు - అల్లు అర్జున్ - రానా - మొదలైన సినీ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ వివాహానికి తెలుగు చిత్రపరిశ్రకు చెందిన ప్రముఖులు - రాజనీయ నాయకులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు.
గమ్యం - వేదం - కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. జాతీయ అవార్డు వస్తే తప్ప వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు.. అయితే కంచె సినిమాతో ఆ కోరిక తీరడంతో ఆయన పెళ్లిపీటలెక్కబోతున్నారు. డాక్టర్ రమ్య ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పటిల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.