కాపీ ఆరోపణలపై క్రిష్ హర్టయ్యాడు

Update: 2016-12-21 11:52 GMT
టీజర్ చూసినా.. ట్రైలర్ చూసినా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగు వాళ్లు గర్వించే సినిమాలాగే కనిపించింది. సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ఐతే ఇలాంటి సినిమా మీద అనూహ్యంగా కాపీ ఆరోపణలు వచ్చాయి. ఇందులోని విజువల్స్ అన్నీ.. ‘బాజీరావు మస్తానీ’ని కాపీ కొట్టి తీసావంటూ ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగు జాతి గౌరవానికి ప్రతీక అని.. అలాంటి సినిమా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని క్రిష్ అన్నాడు. ఈ సినిమాకు దేనితోనూ పోలిక లేదన్నాడు. ఇది అచ్చమైన తెలుగు సినిమా అని చెప్పాడు. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల్ని ఈ సినిమా అందుకుంటుందన్నాడు.

తెలుగు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడం కోసం విజువల్ ఎఫెక్టులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని.. ఇందుకోసం మూడు టీమ్స్ రేయింబవళ్లు కష్టపడుతున్నాయని క్రిష్ చెప్పాడు. మరోవైపు ‘శాతకర్ణి’పై వచ్చిన ఆరోపణలపై చాలామంది మండిపడుతున్నారు. మరాఠా వీరుడు బాజీరావు మస్తానీ మీద తీసిన సినిమాకు.. తెలుగువాడైన గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కుతున్న సినిమాకు పోలిక ఏంటని.. కాపీ ఆరోపణలు చేయడం అర్థరహితమని అంటున్నారు. తెలుగులో ఒక గొప్ప ప్రయత్నం జరుగుతున్నపుడు.. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా తెరకెక్కుతున్నపుడు మద్దతుగా నిలవడం పోయి ఇలాంటి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News