తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ అప్పారావు రాసిన 'కన్యాశుల్కం' నాటకానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాటి సాంఘిక దురాచారాలను ఆయన ఈ నాటకం ద్వారా ఆవిష్కరించిన తీరు, ఇప్పటికీ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటేనే, మనసు తెరపై అందుకు సంబంధించిన సన్నివేశాలు కదులుతూ ఉంటాయి. పామరులకు కూడా అర్థమయ్యేలా ఆయన ఆనాటి సమస్యను ఆవిష్కరించిన తీరు నవ్వులు పూయిస్తూనే ఆలోచింపజేస్తుంది. అలాంటి 'కన్యాశుల్కం' నాటకం, గతంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా సినిమా వచ్చింది.
మళ్లీ ఇప్పుడు ఈ నాటకాన్ని పూర్తిస్థాయిలో వెబ్ సిరీస్ గా ఆవిష్కరించడానికి దర్శకుడు క్రిష్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటు ఉన్న దర్శకులుగా త్రివిక్రమ్ .. సుకుమార్ .. క్రిష్ కనిపిస్తారు. క్రిష్ ఈ మధ్య 'కొండ పొలం' అనే పుస్తకం ఆధారంగా సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు 'కన్యాశుల్కం' నాటకానికి వెబ్ సిరీస్ రూపాన్ని ఇవ్వనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.
సోనీ లివ్ ఓటీటీ కోసం ఆయన ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన ఆయన, దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తాడట. అంటే వేరే వారి దర్శకత్వం చేస్తారన్న మాట. 'హరి హర వీరమల్లు' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉండటం వలన, ఆయన దర్శకత్వ బాధ్యతలను వేరే వారికి అప్పగిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు.
'కన్యాశుల్కం' నాటకం ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. బాల్యవివాహాలు .. వితంతు వివాహాలతో పాటు ఇతర మూడాఛారాలు ఆనాటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయనేది చాటి చెబుతుంది. ముఖ్యంగా అప్పట్లో ఆచారాల పేరుతో స్త్రీ స్వేచ్ఛని అణచివేసే ప్రయత్నాలు బలంగా జరిగిన తీరు కనిపిస్తుంది. ఈ నాటకంలో గిరీశం .. మధురవాణి .. బుచ్చమ్మ .. రామప్ప పంతులు .. లుబ్ధావధానులు .. కరటక శాస్త్రి .. సుబ్బి తదితర పాత్రలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ప్రతి పాత్ర ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. వెబ్ సిరీస్ గా ఈ నాటకం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.