లోకేష్ కనగరాజ్ ని స్టార్లు రౌండప్ చేస్తున్నారు! ఈ కన్ఫ్యూజన్ లో ఎక్కువ సినిమాలు తీసేస్తాడేమో!! కార్తీతో `ఖైదీ`.. విజయ్ తో `మాస్టర్`.. కమల్ హాసన్ తో `విక్రమ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్. ఈ మూడు సినిమాలను మూడు విభిన్నమైన కథలతో అతడు తెరకెక్కించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కమల్ హాసన్ - విజయ్ సేతుపతి- ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్లతో విక్రమ్ సినిమాని మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ గా మలిచిన తీరుకు దేశవ్యాప్తంగా ఆడియెన్ స్పెల్ బౌండ్ అయిపోయారు.
తదుపరి లోకేష్ కనగరాజ్ తో పని చేసేందుకు పలువురు టాప్ స్టార్లు క్యూలో ఉన్నారు. ఓ వైపు కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తూనే విక్రమ్ సీక్వెల్ కోసం ప్రణాళికల్లో ఉన్నాడు. ఈలోగానే లోకేష్ దళపతి విజయ్ తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. ఇంతలోనే అతడితో పని చేసేందుకు ఇటు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ - అల్లు అర్జున్- చిరంజీవి లాంటి స్టార్లు ఆసక్తిగా ఉన్నారని కథనాలొచ్చాయి. ఇంతలోనే కనగరాజ్ కోసం బాలీవుడ్ నుంచి కాంపిటీషన్ మొదలైంది.
అక్కడ యువహీరో వరుణ్ ధావన్ లోకేష్ కనగరాజ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. అంతేకాదు వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ-వరుణ్ ధావన్ హిందీ చిత్రాలను దక్షిణాదితో పోల్చాడు. దక్షిణాది నుండి మనం (బాలీవుడ్) ప్రేరణ పొందాలని సూచించాడు.
ధావన్ `జగ్ జగ్ జీయో`లో చివరిగా కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందగలిగింది. తదుపరి ధావన్ `భేదియా`తో భారీ ప్రయోగం చేస్తున్నాడు. దీనిని పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో అతడు మునుపెన్నడూ చూడని తోడేలు అవతార్ లో కనిపిస్తాడు. ఈ పాత్రను తెరపై ప్లే చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని ఇటీవల కథనాలొచ్చాయి. హిందీ - సౌత్ చిత్రాల పోలిక గురించి యువహీరోని ప్రశ్నించినప్పుడు.. హిందీ చిత్రాలు తెరపై ఒక**** కిక్ కాబోతున్నాయని పేర్కొన్నాడు. SS రాజమౌళి- లోకేష్ కనగరాజ్ - S శంకర్ సహా సౌత్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్ద దర్శకులతో కలిసి పని చేయాలనే కోరికను కూడా అతను వ్యక్తం చేశాడు. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు.
వరుణ్ ధావన్ ఇటీవల చాటింగ్ సెషన్ లో హిందీ చిత్ర పరిశ్రమ సౌత్ నుంచి ప్రేరణ పొందాలని `కాంతారా- KGF` వంటి చిత్రాలు మంచి సినిమాకు ఎలా స్ఫూర్తినిస్తాయో కూడా వెల్లడించాడు. అతను మాట్లాడుతూ-``భారతీయ సినిమాలు నిజంగా బాగా ఆడుతున్నాయి... కాంతారా నిజంగా చక్కని విజయం సాధించింది. KGF 2 లేదా విక్రమ్ చిత్రాల నుండి ప్రేరణ పొందాలి. ఒకరితో ఒకరు కలిసి ప్రయత్నించాలి. ప్రస్తుతం భారతీయ సినిమాలు ఎదగడం గొప్ప విషయం. ప్రస్తుతం హిందీ చలనచిత్రాలు ఒక**** కిక్‌ను పొందేందుకు చాలా సులభం అని నాకు తెలుసు. కాబట్టి నేను ఇలాంటి నిజాలను చెప్పడానికి ఇది గొప్ప సమయం. ఈ కొత్త విధానం సులభమైన సమాధానం. తెలుగు- తమిళంలో సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. భేదియా తెలుగు- తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది... అని వరుణ్ ధావన్ తెలిపారు.
బాలీవుడ్ తారలు సౌత్ లో ఎలాంటి స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారో .. తమను ఇతర భాషల్లో ఓపెన్ హార్ట్ తో ఎలా స్వాగతిస్తారో కూడా ధావన్ ప్రస్తావించాడు. KGF చాప్టర్ 2 ని ఉదహరిస్తూ...KGF 2 లో రవీనా టాండన్ - సంజయ్ దత్ కూడా ఉన్నారని అలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఎందుకు మరచిపోతారు? అని కూడా అడిగాడు. దక్షిణాది ప్రజలు అందరినీ ప్రేమిస్తారు. మనం కూడా వారిని ఇష్టపడతాము. అక్కడ నుండి అందరు నటీనటులను ప్రేమిస్తున్నాను. నేను కేవలం స్ఫూర్తిని కోరుతున్నాను... అల్లు అర్జున్ అద్భుతంగా నటిస్తున్నాడు. యష్ KGFతో అద్భుతాలు చేసాడు.. అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా కన్నడ చిత్రం `కాంతార`ను చూస్తే ఈ చిత్రానికి రచన- దర్శకత్వం అద్భుతం. ఒకే వ్యక్తి నటించిన విధానం బావుంది. రిషబ్ శెట్టి బాగా నటించాడు. ప్రజలు మనల్ని విభజించగలరు. కానీ మనం ఒకే దేశం .. ఒకరికొకరం సహకరించుకోవడానికి ఇది మంచి సమయం ఎందుకంటే సినిమా పరిశ్రమలన్నిటా పెద్ద మార్పును చూస్తున్నామని వరుణ్ ధావన్ విశ్లేషించారు. భేదియా లో కృతి సనన్ - అభిషేక్ బెనర్జీ- దీపక్ డోబ్రియాల్ తదితరులు నటించారు. నవంబర్ 25న విడుదల కానుంది.