ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం మణిరత్నాన్ని గుండెల్లో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నానికి వైద్యులు ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారని - ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్త తెలిసిన మణిరత్నం సన్నిహితులు - కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తుంది. మణితరత్నం అస్వస్థతకు గురైన వార్త తెలిసిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీప్రముఖులు - అభిమానులు ప్రార్థిస్తున్నారు. అయితే, మణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై అపోలో డాక్టర్లు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు, తాము రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చామని మణిరత్నం పీఆర్ వో చెబుతున్నారు.
కాగా, మణిరాత్నానికి గుండెపోటు రావడం ఇది రెండోసారి. 2004లో హిందీ `యువ`షూటింగ్ సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. 2009 - 2015లో కూడా మణిరత్నం....గుండెల్లో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత చికిత్స్ అనంతరం ఆయన కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం `చెక్క చివాంత వానం` అనే సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల జరిగే పరిణామాలు - నష్టాల నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కుతోంది. ఈ చిత్రంలో శింబు - విజయ్ సేతుపతి - అరవింద స్వామి - అరుణ్ విజయ్ - జ్యోతిక - అదితి రావు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.