దర్శకుడు మారుతి తొలి చిత్రం 'ఈ రోజుల్లో'తో ట్రెండ్ సెట్ చేశాడు అప్పట్లో. కొత్త నటీనటుల్ని పెట్టి, చాలా తక్కువ బడ్జెట్లో, డిజిటిల్ కెమెరాతో తీసిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుని పెట్టుబడి మీద కొన్ని రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత యువ దర్శకులు చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇక మారుతి రెండో చిత్రం 'బస్ స్టాప్' ఇంకా పెద్ద హిట్టయింది.
మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన స్క్రిప్టుతో తెరకెక్కిన 'ప్రేమకథా చిత్రమ్' మరింత ఘనవిజయం సాధించింది. ఐతే ఈ చిత్రాలు అంత పెద్ద హిట్టయినా.. మారుతికి కొన్ని విమర్శలు తప్పలేదు. అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. అందుక్కారణం.. ఆ చిత్రాల్లోని బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, సన్నివేశాలే. ముఖ్యంగా 'బస్ స్టాప్' సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులైతే జుగుప్సాకరంగా అనిపిస్తాయి. కుర్రాళ్లు ఈ సినిమా ఎగబడి చూడడానికి అవే ప్రధాన కారణం అయినప్పటికీ.. మారుతి సినిమాలంటే కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది అప్పట్లో.
మారుతి సొంతంగా తీసిన సినిమాలే కాదు.. ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో, రచనా సహకారంతో తెరకెక్కిన సినిమాలు కూడా అదో టైపుగా ఉండేవి. వాటి వల్ల మారుతి మీద 'బూతు' ముద్ర పడిపోయింది. ఇలాంటి టైంలో ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాని మారుతితో సినిమా చేయబోతుంటే అతడి అభిమానులు కంగారుపడ్డారు. నాని సినిమాలోనూ మారుతి మార్కు బూతులుంటే ప్రేక్షకులు తట్టుకోగలరా అని సందేహించారు.
కానీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌తో 'భలే భలే మగాడివోయ్' తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మారుతి. అది నాని, మారుతి కెరీర్లలో గొప్ప మలుపుగా నిలిచింది. అక్కడి నుంచి మారుతి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే తీస్తూ మంచి పేరు సంపాదించాడు. తన మీదున్న 'బూతు' ముద్రను పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మారుతి మళ్లీ పాత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడేమో అనిపిస్తోంది. 'పక్కా కమర్షియల్' సినిమాలో కొన్ని సీన్లు, డైలాగుల్లో డబుల్ మీనింగ్ డోస్ బాగా ఎక్కువైపోయింది. రావు రమేష్ పెళ్లి, శోభనం చుట్టూ తిరిగే సన్నివేశాల్లో డైలాగుల గురించి ఇక్కడ ప్రస్తావించాలంటే కష్టం అన్న స్థాయిలో బూతులు దట్టించేశాడు మారుతి.
ఆ సన్నివేశాలు చూస్తున్నంతసేపు అందరికీ పాత మారుతి గుర్తుకొచ్చాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అలాంటి డైలాగులు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇబ్బంది పడే డైలాగులవి. మరి కష్టపడి పోగొట్టుకున్న ముద్రను మారుతి మళ్లీ ఎందుకు రుద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లో? తన సినిమాల్లో కంటెంట్ తగ్గే మళ్లీ బూతును ఆశ్రయిస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.