దర్శకనిర్మాత సాజిద్ ఖాన్ బిగ్ బాస్ 16 హౌస్ లో ఎంట్రీ ఇస్తున్నారు అనగానే రకరకాల వివాదాలు సంచలనంగా మారాయి. మీటూలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వేధింపుల ఫిలింమేకర్ ని ఇలాంటి షోలోకి ఆహ్వానించడం బాధ్యతారాహిత్యం అంటూ తనూశ్రీ దత్తా ఇంతకుముందు రుసరుసలాడింది. అంతకంటే ముందే వివాదాస్పద నటి షెర్లిన్ చోప్రా సైతం తనకు చూపించకూడనిది చూపించి రేటింగ్ అడిగాడంటూ ఆరోపించి సంచలనం సృష్టించింది. సాజిద్ ఎంట్రీ మాటేమో కానీ అంతకుముందే అతడి వల్ల పీడిత బాధితులంతా ఒకే తాటిపైకి వచ్చి ఆరోపించడం ప్రారంభించారు. ఇది నిజంగా అతడికి కోలుకోలేని దెబ్బ.
తాజాగా టీవీ నటి కనిష్క సోని ఆరోపణలు సంచలనంగా మారాయి. దో దిల్ ఏక్ జాన్- పవిత్ర రిష్తా- దియా ఔర్ బాతీ హమ్ - దేవోన్ కే దేవ్...మహాదేవ్ వంటి టీవీ షోలలో నటించిన నటి కనిష్క సోనీ దర్శకనిర్మాత సాజిద్ ఖాన్ తనను అవకాశమిస్తాననే సాకుతో తన ఇంటికి ఆహ్వానించి అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ లో సాజిద్ కనిపించనున్నందున 14 సంవత్సరాల తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టాలనుకుంటున్నట్టు సోని వెల్లడించింది. ఆమె 2008లో ఖాన్ తో తన అనుభవాన్ని వివరించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది.
MeToo నిందితుడు సాజిద్ ఖాన్ బిగ్ బాస్ 16 హౌస్ లోకి ప్రవేశించాడు. సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్న ఈ షోలో అతను పాల్గొనడం చాలా మందికి కోపం తెప్పించింది. MeToo ఉద్యమం సమయంలో సాఇద్ లైంగికంగా అనుచితంగా ప్రవర్తించాడని పలువురు మహిళలు ఆరోపించారు. అతనిని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఒక సంవత్సరం నిషేధం విధించింది.
కనిష్క ఇన్ స్టాగ్రామ్ వీడియో దుమారంగా మారింది. 2008లో ఖాన్ తన జుహు ఇంటికి ఆమెను ఆహ్వానించినట్లు తెలిపింది. ఆమె సంకోచిస్తుండగా.. భయపడాల్సిన అవసరం లేదని ఆమెకు హామీ ఇచ్చాడు. ఇంట్లో అతనిని కలిసినప్పుడు తన టాప్ ఎత్తి కడుపు బాగం చూపించమని అడిగాడు అని ఆరోపించింది.
ఈ వీడియోతో పాటు కనిష్క సుదీర్ఘమైన నోట్ రాసింది. ఈ శక్తివంతమైన వ్యక్తులు నన్ను ఎప్పుడైనా చంపగలరని భావిస్తున్నందున ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావడానికి భయపడుతున్నట్లు పేర్కొంది. ఆమె ఇంకా ఇలా రాసింది. ''గత నెలలో నేను నా ఇంటర్వ్యూలలో మాట్లాడిన వ్యక్తి పేరును బయటపెట్టడానికి నేను చాలా భయపడుతున్నాను. అతను నన్ను అతని ఇంటికి పిలిచాడు. అతని చిత్రంలో నాకు పాత్ర ఇచ్చినందుకు నా టాప్ ఎత్తి కడుపుని చూపించమని నన్ను అడిగాడు. 2008 లో ఇది జరిగింది కానీ ఇప్పుడు అతను బిగ్ బాస్ గా మారినందున చాలా మంది సినీ స్నేహితుల నుండి డిమాండ్ ఉన్నందున నేను మొత్తం కథను నా అనుభవాన్ని సరిగ్గా ఏం జరిగిందో చెబుతున్నాను'' అని పేర్కొంది.
"మీకు మొత్తం నిజాలు చెబుతున్నప్పుడు నేను చాలా అభద్రతా భావానికి గురవుతున్నాను. ఈ శక్తివంతమైన వ్యక్తులు ఎప్పుడైనా నన్ను చంపగలరు. నేను భారత ప్రభుత్వం చట్టాల నుండి నిస్సహాయంగా ఉన్నాను. కానీ నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. నేను వారితో పోరాడుతానని విశ్వసిస్తున్నాను. అందరూ కలిసి నాకు సమాధానం చెప్పండి.. దేవత నాలో ఉందని ప్రతి ఒక్కరినీ శిక్షించడానికి సిద్ధంగా ఉందని నేను పూర్తిగా భావిస్తున్నాను. నేను మీరందరూ #బిగ్‌బాస్‌లోకి అంగీకరించిన #సాజిద్‌ఖాన్ గురించి మాట్లాడుతున్నాను... అంటూ బీయింగ్ సల్మాన్ ఖాన్ ని ట్యాగ్ చేస్తూ కనిష్క మాట్లాడింది. బిగ్ బాస్ కోసం ఎవరినైనా ఎంపిక చేసే ముందు బిగ్ బాస్ ఎంచుకున్న పాత్రలను అతను అలా చూడడు అని గ్యారెంటీ ఏం ఉంది? దయచేసి వీడియో మొత్తం చూడండి. సుదీర్ఘమైనది.. కానీ నేను హృదయంలోంచి మాట్లాడగలిగాను. నేను ప్రపంచంతో జరిగినది పంచుకుంటున్నాను. దీని తర్వాత నేను భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోను. నేను భయపడుతున్నాను. కానీ బలహీనంగా లేను .. నేను శక్తివంతంగా.. సానుకూలంగా ఉన్నాను. హాలీవుడ్ లో నా కెరీర్ కి కొత్త ప్రారంభం" అని కూడా రాసింది.
కనిష్క సోని 2007లో సింగింగ్ రియాలిటీ షో 'బాత్రూమ్ సింగర్'లో పాల్గొని తన కెరీర్ ని ప్రారంభించింది. ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 2లో గెస్ట్ కంటెస్టెంట్ గా ఉంది. ఆమె 2013లో తమిళ చిత్రం 'పాఠవేరం కోడి'లో కూడా నటించింది. తర్వాత కొన్ని సినిమాలు చేసింది. దేవరాయ - యువరాజయం వంటి సినిమాల్లో నటిగా మెప్పించింది. ఆమె ఇటీవల తనను తానే పెళ్లాడి హెడ్ లైన్స్ లోకి ఎక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.