మెగాపవర్ స్టార్ రాంచరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించారో.. అప్పటినుండి సినిమా పై అంచనాలతో పాటు ఊహగానాలు కూడా అదే రేంజిలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి డైరెక్టర్ శంకర్ సినిమా అంటేనే బడ్జెట్ విషయంలో రాజీపడకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే బడ్జెట్ కూడా మినిమమ్ వంద నుండి నూటయాభై కోట్లు అంచనా వేస్తారు. అయితే ప్రస్తుతం ఈ స్టార్ కాంబినేషన్ మూవీపై కూడా సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అందులో కొన్ని ఫన్నీగా వైరల్ అవుతున్నాయి. ఒక మీమ్ మాత్రం బాగా వైరల్ అవుతోందట. అదేంటంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ శంకర్ తో.. 'మన సినిమా బడ్జెట్ 100 కోట్లుగా ఫిక్స్ అయ్యాను. అనగానే డైరెక్టర్ స్పందించి 'అవునా.. అయితే మన సినిమాలో సాంగ్స్ కి సరిపోతాయి' అంటూ క్రియేట్ చేసిన మీమ్ తెగవైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా దిల్ రాజుకు 50వ సినిమా. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాడట. దిల్ రాజు డైరెక్టర్ శంకర్ తో సుధీర్ఘ చర్చలు జరిపిన తర్వాత చివరిగా సినిమా బడ్జెట్ 150కోట్లు అని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇలాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు బడ్జెట్ ప్రధానంగా డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా సాంకేతికవర్గానికే సగం ఖాళీ అయిపోతుంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా డైరెక్టర్, హీరోల క్రేజ్ బట్టే సినిమా బడ్జెట్ అంచనా వేస్తారు. ఈ విధంగా చూస్తే డైరెక్టర్ శంకర్ ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్ అనే గుర్తింపు ఆల్రెడీ పొందాడు. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. అందుకే ఈ లెక్కన చూస్తే వీరి కాంబినేషన్ కి 150 కోట్లు అనేది తక్కువే అనిపిస్తుందని సినీవర్గాల టాక్. అలాగే ఈ స్టార్స్ హైప్ చూస్తే.. కేవలం డిజిటల్, సాటిలైట్ హక్కుల ద్వారానే వందకోట్లు వస్తాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారట. చూడాలి మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో!