షార్ట్ ఫిలిం టు బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియా దాకా ఎదిగిన దర్శకుడు సుజిత్ కు సాహో కనక కరెక్ట్ గా క్లిక్ అయ్యుంటే ఎలాంటి అద్భుతాలు జరిగేవో ఊహించుకోవడం కూడా కష్టమే. ఎందరో సీనియర్ దర్శకులు సైతం కలలా భావించే అవకాశాన్ని రెండో సినిమాతోనే కొట్టేసిన సుజిత్ తీరా ఫలితాన్ని చూశాక యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశాడు. ఇంటర్వ్యూలు ఇస్తూ సాహో గురించి తాను పడిన కష్టాన్ని ప్రేక్షకులు ప్రేమిస్తున్న విధానాన్ని ఒకటే చెప్పుకుంటున్నాడు.
ఇది ఎవరైనా చేసేదే కాబట్టి అందులో తప్పుబట్టడానికి లేదు. అందులోనూ మొదటి వారం పూర్తయ్యే సమయానికే సాహో వసూళ్ళ పరంగా చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉంది ఇంకాస్త ప్రమోషన్ చేయడం చాలా అవసరం. అయితే ఈసారి ప్రభాస్ బదులు ఈ బాధ్యత మొత్తం సుజిత్ తీసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రివ్యూల గురించి ప్రస్తావిస్తూ తాను వీటిని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటానని కాకపోతే సాహో లాంటి సినిమాలకు కొంత టైం ఇచ్చి అభిప్రాయాలు చెబితే ఇంకా బాగుంటుందని అన్నాడు.
అమెజాన్ ప్రైమ్ లాంటి యప్స్ వచ్చాక నెల రోజులు ఆగితే ఇంట్లోనే ఫ్రీగా చూసే వెసులుబాటు ఉన్నప్పుడు సినిమాకు మూడు గంటలు ధియేటర్ రానుపోను ప్రయాణానికి రెండు గంటలు ఎందుకు ఖర్చు పెట్టాలనే ఆలోచన వచ్చిందని లాజిక్ చెప్పాడు. అందుకే సమీక్షల మీద ఎక్కువ ఆధారపడుతుంటారని వివరించాడు. సాహో మీద వచ్చిన నెగటివ్ రిపోర్ట్స్ ని ప్రస్తావించకుండా రివ్యూలను తాను గౌరవిస్తానని వాటిని చదివి ఫాలో అవుతానని సుజిత్ చెప్పడం గమనార్హం