కుమారిని తీసేసి మళ్లీ అదే కాంబినేషన్

Update: 2017-07-29 05:52 GMT
రెండు ఏళ్ళు కిందట ఒక చిన్న సినిమా వచ్చి తెలుగు యూత్ ప్రేక్షకులును అయస్కాంతం లాగా ఆకర్షించింది. ''కుమారి 21f'' అనే సినిమా సుకుమార్ రైటింగ్స్ సంస్థలో డైరెక్టర్ సుకుమార్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన రాజ్ తరుణ్ అండ్ హెబ్బా పటేల్ ఒక్కసారిగా యూత్ ఐకాన్స్ అయిపోయారు. చిన్న సినిమాలు చేస్తూ ఇద్దరూ పెద్ద స్టార్లు ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది తెలుసా!!

అసలు కుమారి సినిమా గురించి మాట్లాడితే.. ముందు అందరూ కుమారి హెబ్బా పటేల్ గురించే మాట్లాడతారు. హెబ్బా పటేల్ అంత పేరు తెచ్చుకుంది. కేవలం హెబ్బా పటేల్ కోసం స్పెషల్ కథలు రాస్తున్నారంటే ఆమె క్రేజ్ చూసుకోండి. ఆ తరువాత రాజ్ తరుణ్‌ ఈ సినిమా ఓ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇంకా కుమారి 21f విజయానికి మూలకారణం డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కూడా. అతనికి సుకుమార్ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. మరో ముఖ్య మైనది ఈ సినిమా విజయానికి కారణం ఆ సినిమా మ్యూజిక్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇచ్చిన సంగీతం ఆ సినిమాకు వెన్నుముకలా నిలిచింది. అయితే ఇప్పుడు కుమారి హెబ్బా పటేల్ ను పక్కనెట్టేసి.. మళ్ళీ రాజ్ తరుణ్ - పల్నాటి సూర్యప్రతాప్ - దేవి శ్రీ ప్రసాద్ - సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందట. ఈ కొత్త సినిమాను సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నరు.

విషయం ఏంటంటే.. ఇప్పటికే హెబ్బా పటేల్ అండ్ రాజ్ తరుణ్‌ కాంబినేషన్ మరీ ఎక్కువసార్లు రిపీట్ అయిపోయింది కాబట్టి.. ఈసారి మరో హీరోయిన్ కు అవకాశం ఇస్తారట. మరి మరోసారి హెబ్బా టైపులో ఎవరైనా అమ్మాయితో సెన్సేషన్ క్రియేట్ చేయిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News