చాలా ఏళ్ల తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు తేజ తాజాగా 'సీత'తో వచ్చి మళ్లీ నిరాశ పర్చాడు. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సీత' చిత్రం ఆడక పోవడంతో దర్శకుడు తేజ మళ్లీ అవకాశాల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. స్టార్ హీరోలతో సినిమాలు చేయనంటే చేయనంటున్న దర్శకుడు తేజ కొత్త వారితో సినిమాను ట్రై చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గతంలో పలువురు కొత్త వారితో సినిమాలు చేసి తేజ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అదే ప్రయత్నం చేయబోతున్నాడు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వారికి ఇతర హీరోలకు మద్య తేడాను చెప్పుకొచ్చాడు.
తేజ మాట్లాడుతూ.. స్టార్ హీరోల సినిమాలో ఖచ్చితంగా ఆరు పాటలు ఆరు ఫైట్లు ఉండాలి. అలా లేకుండా విభిన్నంగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా సినిమాను ఆధరించరు. ముఖ్యంగా ఆస్టార్ హీరో ఫ్యాన్స్ కు ఆ సినిమా నచ్చదు. మొదటి రోజు సినిమా చూసి వారే బాగాలేదని టాక్ ను స్ప్రెడ్ చేస్తారు. హీరోల అభిమానులు ఒక ఫార్మట్ కు అలవాటు పడిపోయారు. అలా లేకుంటే సినిమాను వారే ఫ్లాప్ చేస్తారంటూ తేజ చెప్పుకొచ్చాడు.
ఉదాహరణకు 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో రానా చివర్లో ఉరి వేసుకునే సీన్ ఉంటుంది. అది కనుక ఒక మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో చేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉరి వేసుకోవడంను ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. రానా స్టార్ హీరో అయినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ అందుకే రానా విషయంలో వర్కౌట్ అయ్యిందని తేజ చెప్పుకొచ్చాడు. పవన్ వంటి స్టార్ హీరోలతో నేను సినిమా చేయాలని కోరుకోను. నేను వారి ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాను తీయలేను అంటూ తేజ నిర్మొహమాటంగా చెప్పేశాడు.