దర్శకుడు తేజ కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తి. ఆఫీస్ బాయ్ నుండి కెమెరా అసిస్టెంట్ అలా అలా దర్శకుడిగా ఎదిగాడు. తేజ దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఎంతో మందిని తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తేజతో పని చేసే వారు అంతా చెప్పే ఒకే మాట ఆయనకు కాస్త కోపం ఎక్కువ. స్టార్స్ తో చేసే సమయంలో అయినా తన కోపంను అదుపులో పెట్టుకోవాలని అతడు భావించడు. నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం. అలాంటి తేజ పెళ్లి అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కొడుకు అయిన అక్కినేని వెంకట్ మరియు ఆయన భార్య వల్ల అయ్యిందట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తేజ వెళ్లడించాడు. తేజ అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్న సమయంలో చెల్లి ద్వారా శ్రీవల్లి పరిచయం అయ్యిందట. పరిచయం అయిన కొన్నాళ్లకు ప్రేమగా మారడం.. పెళ్లి చేసుకోవాలనుకోవడం జరిగిందట. అయితే ఇద్దరి పెళ్లికి అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తేజ సెటిల్ అవుతాడో లేదో అనే భయం వారిలో ఉందట. సినిమాల్లో స్థిరత్వం ఉండదని.. అలాంటి వారికి తమ అమ్మాయిని ఎలా ఇవ్వాలని వారు ఆలోచించారు.
ఆ సమయంలోనే అక్కినేని వెంకట్ గారి భార్య జ్యోత్స్న గారు అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి నాపై భరోసా కలిగించి పెళ్లికి ఒప్పించారు. తప్పకుండా తేజను పెళ్లి చేసుకుంటే శ్రీవల్లి సంతోషంగా ఉంటుందని వారిని ఒప్పించారు. ఇప్పటికి కూడా శ్రీవల్లిని నేను ఎలా చూసుకుంటున్నాను అనే విషయాలను వెంకట్ గారి ఫ్యామిలీ తెలుసుకుంటూనే ఉంటుంది.
నా కోపం శ్రీవల్లిపై కూడా చాలా సార్లు చూపించారు. నాకు అన్నంలోకి పెరుగు తప్పనిసరిగా ఉండాలి. ఒకసారి వరుసగా మూడు రోజులు కూడా పెరుగు సరిగా లేదు. దాంతో నాకు కోపం వచ్చింది. ఇద్దరి మద్య మాట మాట పెరిగింది. విడాకుల వరకు వెళ్లాం. అయితే పెద్దలు మాట్లాడటంతో ఇద్దరి మద్య రాజీ కుదిరి మళ్లీ కలిసి ఉన్నాం అంటూ తన వైవాహిక జీవితం గురించిన విశేషాలను తేజ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.