కాజల్-బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వం వహించిన `సీత` ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై క్రిటిక్స్ పెదవి విరిచేయడం విధితమే. తొలి వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉన్నా.. ఈ సోమవారం నుంచి సీత కు అసలు టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే సీత గురించే కాదు.. ఏ సినిమా ఫలితం గురించి ఎవరూ ముందే ఊహించలేరని.. జేమ్స్ కామెరూన్ అంతటి వాడే సినిమాల ఫలితం ఊహించలేరని తేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. `నువ్వు నేను` సినిమాని ఇప్పుడు చూసినా ఇంకా బాగా తీస్తే బావుండునని ఫలానా సీన్ ఎడిట్ చేస్తే బావుంటుందని అనుకుంటానని... అసలు దర్శకుడిగా సంతృప్తి చెందనని తేజ అన్నారు.
అదంతా సరే.. వెంకీతో సినిమా అన్నారు? కదా ఉందా .. అని ప్రశ్నిస్తే.. చేయాల్సిందే కానీ కుదరలేదని తెలిపారు. ఒకే రోజు ఉదయం వెంకీ సినిమా.. సాయంత్రం ఎన్టీఆర్ సినిమా వదులుకున్నానని ఓపెన్ గా చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. అసలు యన్టీఆర్ బయోపిక్ ని వదులుకోవడానికి క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణమా? అని ప్రశ్నిస్తే అసలు సంగతిని తేజ బరస్ట్ అయిపోయారు.
``ఏదైనా సినిమా కథ ఒకటికి పది సార్లు అనుకుంటాం. తీరా మొత్తం సినిమా తీశాక కూడా నిర్మాతకు ఒకసారి చూపించి ఏవైనా నచ్చకపోతే మారుస్తాం. అందువల్ల కథపరంగా నేనేదో రాజీ పడలేదనడం సరికాదు`` అంటూ అసలు సంగతిని చెప్పారు. తేజ మాటల్ని బట్టి ఎన్టీఆర్ బయోపిక్ కథ విషయంలో రాజీకి రాలేకనే తేజ వదులుకున్నారని అర్థమవుతోంది. ఇక మరో మాటను తేజ ఈ సందర్భంగా ప్రస్థావించారు. తేజ ఆర్టిస్టులను కొడతాడు అని ఓ విమర్శ ఉంది కదా. ఆ మాట వల్ల ప్రయోజనం ఏంటంటే... నటన రానివాళ్లు నా దగ్గరకు రారు. వచ్చిన వాళ్లే వస్తారు. అది కూడా మంచే కదా`` అని అన్నారు. ఇది తాను ఆర్టిస్టులను కొడతాడన్న అపవాదుపై తేజ ఇచ్చిన వివరణ అన్నమాట. తదుపరి ఏ సినిమాలు చేస్తున్నారు? అని ప్రశ్నిస్తే `ఇంకా ఏమీ అనుకోలేదు` అని తెలిపారు.