దగ్గుబాటి రానా హీరోగా.. తేజ దర్శకత్వంలో రూపొందిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. పొలిటికల్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదే సమయంలో పబ్లిసిటీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. మొదట తెలుగులోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించినా.. బాహుబలి సిరీస్ తో రానాకు దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కడంతో.. పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయడంలో మొదట అంతగా సక్సెస్ కాలేకపోయిన దర్శకుడు.. టీజర్ తర్వాత మాత్రం ట్రెండ్ మార్చేశాడు. ప్రతీ ఫ్రేమ్.. ప్రతీ డైలాగ్.. జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నేనే రాజు నేనే మంత్రి మూవీపై అంచనాలను కూడా పెంచేశాయి. మార్కెట్ లో ఈ చిత్రంపై నెలకొన్న బజ్ చూసి.. తేజ కూడా సంతృప్తిగానే ఉన్నాడు. మరోవైపు.. సినిమా ఔట్ పుట్ కూడా సూపర్బ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఒక విషయం మాత్రం పలువురిని టెన్షన్ పెడుతోంది.
ఎంత క్రిస్ప్ గా కట్ చేసినా సరే.. నేనే రాజు నేనే మంత్రి నిడివి 160 నిమిషాలు వచ్చిందట. 2 గంటల 40 నిమిషాలంటే.. చాలా ఎక్కువ అని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారట. కనీసం 20 నిమిషాలు ట్రిమ్ చేయాలని అనుకుంటున్నా.. ఈ విషయంలో తేజను ఒప్పించడం అంత సులువు కాదని చెప్పాలి. పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో.. అన్ని సీన్స్ లింక్డ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ డ్యురేషన్ ఒక్కటి మినహాయిస్తే.. నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి వేరే టెన్షన్స్ ఏమీ లేవు.