తేజ బాలీవుడ్ లో లాంచ్ అయి టాలీవుడ్ స్టార్ మేకర్ గా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమా'రాత్' కి సినిమా టోగ్రఫర్ గా పనిచేసారు. అదే అతని బాలీవుడ్ ఎంట్రీ . ఆ తర్వాత చాలా సినిమాలకు ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు. తెలుగులోనూ'అంతం'..'మనీ'..'రక్షణ'..'తీర్పు'..'మనీ మనీ' లాంటి సినిమాలకు అదే విభాగంలో పనిచేసారు. అక్కడ నుంచి దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. తొలి ప్రయత్నం'చిత్రం' పెద్ద సక్సెస్ అవ్వడంతో తేజ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగింది.
ఆ తర్వాత 'నువ్వు నేను'..'జయం' లాంటి సినిమాలు తేజని దర్శకుడిగతా అగ్ర పథాన నిలబెట్టాయి. ఆ రకంగా ఎంతో మంది కొత్త స్టార్లని తెరపైకి తీసుకొచ్చారు. కానీ అటుపై తేజ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు..రొటీన్ కంటెటె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తేజ రూటు మార్చి'నేనే రాజు నేనే మంత్రి' లాంటి పొలిటికల్ సెటైరికల్ సినిమా చేసి ఆ విమర్శని బ్రేక్ చేసారు.
ఈ సినిమాతో తేజలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ప్రశంసలందుకున్నారు. కానీ తేజ ముక్కుసూటి వ్యవహారం కాస్త అవకాశాలకు దూరం చేసిందని చెప్పాలి. ప్రస్తుతం నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ'అహింస' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉండగానే బాలీవుడ్లో రెండు ప్రాజెక్ట్ లు లైన్ లోకి తీసుకొచ్చారు.'జకీమే' అనే టైటిల్ తో ఓ హిందీ సినిమా చేస్తున్నారు. ఇందులో ఇద్దరు బాలీవుడ్ హీరోలు నటిస్తున్నారు.
కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని సమాచారం. చిత్రీకరణ అంతా అక్కడే ఉంటుందిట. టైమ్ ఫిల్మ్స్ - ఎన్ హెచ్ స్టూడియోస్ - ట్రిప్లిక్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే 'తజ్కారీ' అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ ని తెరెక్కిస్తున్నారుట. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది.
మొత్తం నాలుగు సిరీస్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సిరిస్ ని తెరకెక్కిస్తున్నారుట. ఇందులో నటించే నటీనటులు..సాంకేతిక విభాగం వివరాలు వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.
మొత్తానికి తేజ బాలీవుడ్ లో బిజీ అవుతున్నట్లే తెలుస్తోంది. రెండు దశాబ్ధల క్రితం హిందీలో తుషార్ కపూర్..అనిత్ హీరో..హీరోయిన్లగా'యే దిల్' అనే సినిమా తెరకెక్కించారు. అంతకు ముందు సంజయ్ దత్..జాకీ ష్రాప్ నటించిన'పిటాహ్' చిత్రానికి కథ..మాటలు..కథనం అందించారు. ఆ తర్వాత ఏ హిందీ సినిమాకి దర్శకుడిగా పనిచేయలేదు. మళ్లీ 2 రెండు దశాబ్ధాల అనంతరం బాలీవుడ్ లో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.