యాక్ష‌న్ గోపీతో తేజ మీటింగ్ దేనికి?

Update: 2019-08-10 13:34 GMT
ద‌ర్శ‌కుడు తేజ‌తో గోపీచంద్ అనుబంధం గురించి తెలిసిందే. జ‌యం (2002) సినిమాతో గోపిచంద్ ని విల‌న్ ని చేసిన ఘ‌న‌త తేజ‌దే. యాక్ష‌న్ కం అగ్రెస్సివ్ హీరోని కాస్తా క్రూర‌మైన విల‌న్ గా తెర‌పై ఆవిష్క‌రించారు తేజ. గోపిచంద్ కి విల‌న్ పాత్ర‌తోనే గొప్ప పేరొచ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 2003లో `నిజం` సినిమాలోనూ గోపికి విల‌న్ గా అవ‌కాశం ఇచ్చారు తేజ‌. నితిన్.. మ‌హేష్ సినిమాల్లో విల‌న్ గా అత‌డి న‌ట‌న‌కు జ‌నం నీరాజ‌నాలు ప‌లికారు. అయితే ఆ త‌ర్వాత తేజ‌- గోపిచంద్ మ‌రోసారి క‌లిసి సినిమా చేయ‌లేదు.

ఇన్నాళ్టికి ఈ కాంబినేష‌న్ రిపీట‌వుతోంద‌ని తెలుస్తోంది. దాదాపు 16 ఏళ్ల త‌ర్వాత తిరిగి గోపీతో ఓ యాక్ష‌న్ సినిమా చేయాల‌ని తేజ ప్ర‌పోజ‌ల్ పెట్టార‌ట‌. ఇది భారీ యాక్ష‌న్ స్క్రిప్టు. ఎగ్రెస్సివ్ హీరో శ‌రీర భాష‌కు త‌గ్గ‌ట్టే ఉంటుంద‌ట‌. అన్నీ కుదిరితే ఈ ఏడాది సెట్స్ కెళ్లే వీలుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాని ఎవ‌రు నిర్మిస్తారు అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

మ‌రోవైపు గోపిచంద్ ఓ భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే.  త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ తిరు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల‌ షూటింగ్ టైమ్ లో గాయం అవ్వ‌డంతో నెల‌రోజులు పైగానే బ్రేక్ ఇచ్చారు. గోపి తిరిగి కోలుకుని ప్ర‌స్తుతం పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో 14రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
Tags:    

Similar News