వంశీ ఆఖరి సినిమా అనుకున్నాడట..

Update: 2017-05-09 09:31 GMT
జూన 2న విడుదలవ్వనున్న ''ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్‌ లేడీస్ టైలర్'' సినిమాతో సీనియర్ దర్శకుడు పసలపూడి వంశీ ఇప్పుడు తన సత్తా చాటాలని చూస్తున్నాడు. గత కొంత కాలంగా కేవలం ఫ్లాపులతో కాలక్షేపం చేస్తున్నీ గోదావరి ప్రియుడు.. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తనలోని టాలెంట్ ను మరో యాంగిల్లో బయటకు తీశాడట. అయితే ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం చెప్పాలండోయ్.

నిజానికి ఈ సినిమాను కోనసీమ ప్రాంతంలో రాజోలు చుట్టుప్రక్కల ఏరియాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు.. రోజూ రాత్రి పూట దర్శకుడు వంశీకి నిద్రపట్టేది కాదట. ఒక 15 రోజులు షూటింగ్ చేశాక.. తనతో పనిచేస్తున్న ఎడిటర్ మరియు ఇతర సాంకేతిక నిపుణులను అర్ధరాత్రులు పూట నిద్రలేపి బయటకు రమ్మని.. ఈ సినిమాయే నా ఆఖరి సినిమా అనిపిస్తోంది.. మీరేమంటారు అని అడిగేవారట. ఆల్రెడీ 60 వయస్సు దాటేసిన ఆయన.. ఈ సినిమాను ఎంత డైనమిక్ గా తీసినప్పటికీ.. ఈ సినిమాతో తన సినిమా కెరియర్ ముగుస్తుందేమో అని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారట. ఇంతకీ ఇదే లాస్ట్ అని ఎందుకు అనుకున్నట్లు?

ఇప్పటివరకు చాలా సంవత్సారల నుండి వరుసగా సినిమాలు తీస్తున్న వంశీ.. ఇప్పుడు తన బాడీకి ఎందుకో సినిమా అంటే అలసట వచ్చేసినట్లు ఫీలవుతున్నారట. అందుకే ఒక హిట్టు సినిమా తీసి రిటైర్ అవ్వాలనే కసితో ఈ ''ఫ్యాషన్ డిజైనర్'' రూపొందిచారట. చూద్దాం ఏమవుతుందో!!
Tags:    

Similar News