ఒకప్పుడు మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. అయితే కొన్ని అపజయాలతో అనంతరం వివి వినాయక్ సినిమా అవకాశాలు అందుకోవడం లో కాస్త వెనుకబడ్డారు. అగ్ర హీరోలకు ఆయన చాలాసార్లు కథ చెప్పినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదు. ఆ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్లాన్ కూడా సెట్ అవ్వలేదు.
అయితే వినాయక్ ప్రస్తుతం నటన వైపు కూడా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇది వరకే ఆయన ఠాగూర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా కనిపించారు. ఇక భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించిన వివి వినాయక్ నటుడిగా కూడా కొనసాగే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అప్పట్లో దిల్ రాజు ప్రొడక్షన్ లో నరసింహా అనే దర్శకుడితో వినాయక్ కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తర్వాత వి.వి.వినాయక్ కూడా ఫిట్నెస్ విషయంలో చాలా మార్పులు తెచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఆ ప్రాజెక్టు స్క్రిప్టుపై మధ్యలో మళ్ళీ కొంత చర్చ జరగగా ఎందుకు నమ్మకంగా అనిపించకపోవడంతో దిల్ రాజు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
ఇక ఆ తరువాత మళ్ళీ వివి వినాయక్ దర్శకత్వం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతిని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం వివి వినాయక్ మరో కొత్త ప్రాజెక్టు పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక యువ దర్శకుడు ఆయనకు సరిపడే కథను సిద్ధం చేయడంతో ఆ సినిమాను నిర్మించడానికి మరొకసారి దిల్ రాజు సిద్ధమైనట్లు సమాచారం. మరి ఈసారైనా వివి వినాయక్ వెండితెరపై ఫుల్ లెన్త్ పాత్రలో కనిపిస్తాడో లేదో చూడాలి.