బెడ్ సీన్ క‌ట్ చేస్తాన‌న్న‌ డైరెక్ట‌ర్.. ద‌మ్ములేదా అన్న హీరోయిన్‌!

Update: 2021-06-05 09:30 GMT
కేట్ విన్ స్లెట్ అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ.. 'టైటానిక్' మూవీ హీరోయిన్ అంటే మాత్రం ప్ర‌పంచం మొత్తానికీ తెలుసు. ఆ సినిమాతో అంత‌గా ఫేమ‌స్ అయిపోయింది కేట్‌. ఆ త‌ర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించి హాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలిగిపోయింది. తాజాగా.. ఈ బ్యూటీ న‌టించిన మూవీ ''మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్‌''.

ఈ చిత్రంలో ఓ హాట్ సీన్లో న‌టించింది కేట్. ఆ సీన్ లో బ్యూటీ న‌డుము క్లియ‌ర్ క‌ట్ గా క‌నిపించింది. అయితే.. న‌డుము క‌నిపించ‌డం కాదు స‌మ‌స్య‌. వ‌య‌సు మీద ప‌డుతోంది క‌దా.. పొట్ట భాగం లూజుగా క‌నిపించ‌డ‌మే స‌మ‌స్య‌. దీనివ‌ల్ల రొమాన్స్ స‌రిగా పండ‌లేద‌ని భావించాడేమో కానీ.. ఆ బిట్ వ‌ర‌కు ఎడిట్ చేస్తాన‌ని చెప్పాడ‌ట ద‌ర్శ‌కుడు. దీనికి అంగీక‌రించ‌లేద‌ట కేట్ విన్ స్లెట్‌.

ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కేట్.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ''మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ సినిమాలోని బెడ్ సీన్ లో నా పొట్టభాగం లూస్ గా కనిపించడంతో దాన్ని కట్ చేద్దామని దర్శకుడు అన్నాడు. దానికి నేను.. మీకు యాజిటీజ్ గా చూపించే ధైర్యం లేదా? అని ప్ర‌శ్నించాను.'' అని చెప్పింది కేట్.

ఇక‌, ఈ సీన్లోనే కాకుండా.. పోస్ట‌ర్ ను సైతం ఎడిట్ చేయాల‌ని కోర‌గా.. తాను అంగీక‌రించ‌లేద‌ని చెప్పింది కేట్‌. త‌న వ‌య‌సు పెరుగుతోంద‌నే విష‌యం త‌న‌కు అర్థ‌మ‌వుతోంద‌ని ప‌రోక్షంగా చెప్పిన కేట్‌.. త‌న కంటి ప‌క్క‌న్న ఎన్ని ముడ‌త‌లు ఉన్నాయో.. త‌న‌కు తెలుసు అని అన్నారు. అంతేకాదు.. అవ‌న్నీ అలాగే ఉంచాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం డిస్నీ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఇప్పుడు కేట్ విన్ స్లెట్ వ‌య‌సు 45 సంవ‌త్స‌రాలు.
Tags:    

Similar News