ఈ రోజుల్లో ఒకరి స్టార్ ఇమేజ్ కన్నా మంచి కథలే బాక్స్ ఆఫీస్ దగ్గర క్రేజ్ అందుకుంటున్నాయి. ముందు మాత్రం అంచనాలు పెరగడం సాధారణ విషయమే దీంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ లెక్కలు తారుమరవ్వడం పక్కా. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కాలాపై ప్రస్తుతం అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అయితే రజినీకాంత్ సినిమాలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్ లోని యూఎస్ లో రజినీకాంత్ ప్రతి సినిమా డాలర్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక ఏప్రిల్ 27న రిలీజ్ కాబోయే కాలా సినిమాను కూడా అక్కడ బారి స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే కాలా సినిమాకు ఒక భారీ సినిమా ఎఫెక్ట్ పడనుంది. హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ రిలీజ్ కానుంది. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 4న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సడన్ గా ఆ సినిమా విడుదలని వాయిదా వేశారు.
ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని ఆ సినిమా నిర్మాణసంస్థ మార్వెల్ స్టూడియోస్ వారు రీసెంట్ గా తెలియజేశారు. దీంతో ఆ సినిమా 24 గంటల ముందే అమెరికా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే కాలా సినిమాపై పడనుందని టాక్ వస్తోంది. అంతే కాకుండా ఓ వారం ముందు మహేష్ బాబు - భరత్ అనే నేను కూడా రిలీజ్ కానుంది. ఆ రెండు సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రజినీకాంత్ - కాలా కలెక్షన్స్ లో తేడా రావచ్చని సమాచారం. మరి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఎంతవరకు లాభాలను అందుకుంటుందో చూడాలి.