వద్దు వద్దు అంటే రిలీజ్ చేశారు! ఐపు లేకుండా పోయారు!! ముంచుకొస్తున్న సునామీని గౌరవించకుండా.. కంగారు పడి ఖాళీ అయిపోయారు. బాక్సాఫీస్ వద్ద ఎందుకూ కొరగాకుండా పోయారు. ఇంతకీ ఎవరు? ఏమా కథాకమామీషు అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
గత నెలరోజులుగా `అవెంజర్స్-4` రాక గురించి విస్త్రతంగా ప్రచారం సాగుతోంది. ఆ సినిమా వస్తే అన్నిచోట్లా కచ్ఛితంగా ఇతర సినిమాల కలెక్షన్స్ కి పంచ్ పడుతుందని ట్రేడ్ నిపుణులు తొలి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక థియేటర్ ఓనర్లు సైతం అన్నంత పనీ చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మన ఎగ్జిబిటర్లు `అవెంజర్స్ - ఎండ్ గేమ్` కోసం ఏకంగా 500 థియేటర్లు కేటాయించారు అంటే అర్థం చేసుకోవాలి. క్రేజు ఉన్నది ఏది అయినా హాట్ కేక్. అవెంజర్స్ మానియా గురించి ఎంతో ముందే ఆలోచించిన డి.సురేష్ బాబు అంతటి దిగ్గజం తన థియేటర్లలో మెజారిటీ పార్ట్ ఆ సినిమాకే కేటాయించారని తెలుస్తోంది. ఇక అవెంజర్స్ 4లో థానోస్ పాత్రకు దగ్గుబాటి రానానే వాయిస్ అందించారు. పైగా అతడే ప్రచారం కూడా చేశారు. ఎన్ని కారణాలు ఉన్నా ముంచుకొస్తున్న ఉప్పెన గురించి ఏమాత్రం ఆలోచించకుండా 26/4 (26 ఏప్రిల్) రోజున అవెంజర్స్ తో పోటీపడుతూ రిలీజైన అరడజను సినిమాలకు పీడకలలు తప్పలేదని తెలుస్తోంది.
ప్రచారం లేక జనాలకు కనీసం ఆ సినిమాల పేర్లు అయినా తెలియవేమో!! 26/4/19న రిలీజ్ లకు వచ్చిన సినిమాల జాబితాని పరిశీలిస్తే .. 90ఎంఎల్ .. దుప్పట్లోమిన్నాగు .. దిక్సూచి .. డేంజరస్ లవ్ స్టోరి ...యమలోకం.. ఎంబీఎం (మేరా భారత్ మహాన్) లాంటి చిత్రాలు ఈ శుక్రవారం రిలీజయ్యాయి. అయితే ఇవేవీ అవెంజర్స్ ధాటికి కనీస మాత్రంగా అయినా తెలిసి రాలేదు. ఇక ఇలాంటి హోరులో రిలీజ్ కి వస్తే పరిణామం ఏంటో ముందే ఊహించిన `ఛలో గీత` టీమ్ తెలివిగా స్కిప్ కొట్టింది. రిలీజ్ ని అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారు. ఇక నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం సైతం బోలెడంత డ్రామా నడుమ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆగిపోయిన వాళ్లు బతికిపోయారు. ఇకపోతే ఇంత హోరులోనూ బిగ్ బాస్ బ్యూటీ ఓవియా నటించిన బోల్డ్ మూవీ `90ఎంఎల్` మాస్ ఏరియాల్లో కొంత ఊపిందిట.. కానీ..! లాంగ్ రన్ లో ఉంటుందా? అన్నది చెప్పలేని సన్నివేశం ఉంది.
`అవేంజెర్స్4` దెబ్బకు ఎండ దెబ్బ అదనం. ఈ రెండు పంచ్ లకు రిలీజైన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విలవిలలాడాయి. కలెక్షన్స్ పరంగా తీసికట్టుగా ఉందిట సీను. ఇక అవెంజర్స్ మాత్రం రిలీజైన అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ మీద ఉందని రిపోర్ట్ అందింది. ఇక `గీతా.. ఛలో` చిత్రం నిర్మాతలు ఇదంతా ముందు గానే ఊహించి తెలివి గా ఈ సునామి నుండి తప్పించుకొని మంచి రిలీజ్ తేదీ మే3 కి షిఫ్టయ్యారు. అదే సమయానికి పెద్దగా అపోజిషన్ లేదని భావిస్తున్నారు. ఇకపోతే రంగుపడుద్ది .. లక్ష్మీస్ ఎన్టీఆర్ (ఏపీ) చిత్రాలు అప్పటికి రిలీజ్ కి వస్తున్నాయని తెలుస్తోంది.