ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట‌యిపోతారేమో!

Update: 2019-03-01 11:16 GMT
`షేడ్స్ ఆఫ్ సాహో చాప్ట‌ర్ 1` పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది యువి టీమ్. రిలీజైన నిమిషాల్లోనే యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. అందుకే ఇప్పుడు చాప్ట‌ర్ 2ని రెడీ చేసి రిలీజ్ చేస్తున్నారు అన‌గానే ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. మార్చి 3న రిలీజ్ కాబోతున్న ఈ వీడియో కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంత‌కంత‌కు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఛాప్ట‌ర్ 1లో ప్ర‌భాస్ ని ఓ రేంజులో ఎలివేట్ చేశారు. దుబాయ్ .. అబుద‌బీ లాంటి చోట్ల చిత్రీక‌రించిన రిచ్ విజువ‌ల్స్ క‌ట్టి ప‌డేసాయి. కార్ ఛేజ్‌.. బైక్ చేజ్ అంటూ ఒక్క‌సారిగా అంచ‌నాలు పెంచేసారు.

అయితే సాహో చాప్ట‌ర్ 2 వీడియోలో అస‌లు ప్ర‌భాస్ క‌నిపించ‌డు అంటూ ఓ ప్ర‌చారం సాగుతోంది. ఈ రెండో వీడియోలో కేవ‌లం శ్ర‌ద్ధా క‌పూర్ కి సంబంధించిన విజువ‌ల్స్ ని మాత్ర‌మే రివీల్ చేస్తున్నార‌ని తెలిసింది. ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ సైతం ప్ర‌భాస్ కి ధీటుగా స్టంట్స్ చేయ‌బోతోంది. శ్ర‌ద్ధా గ్లింప్స్ మైండ్ బ్లోవింగ్ గా ఉంటాయ‌ని తెలుస్తోంది. కొన్ని నిమిషాల పాటు సాగే వీడియో బైట్ మాత్ర‌మే రిలీజ్ చేస్తార‌ని చెబుతున్నారు. మార్చి 3న శ్ర‌ద్ధా క‌పూర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సాహో టీమ్ త‌ర‌పున కానుక‌గా రిలీజ్ చేస్తున్నార‌ట‌.

అయితే చాప్ట‌ర్ 2లో కేవ‌లం శ్ర‌ద్ధాని మాత్ర‌మే చూపించి ప్ర‌భాస్ ని లైట్ తీస్కుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? అస‌లే ఫ్యావ‌రెట్ హీరోని చూసి చాలా కాల‌మే అయ్యింది. అందువ‌ల్ల అభిమానులు ఎంతో వేడి మీద ఉన్నారు. లైట్ తీస్కోమంటే క‌ష్టమే. ఈ ఎగ్జయిట్ మెంట్ లో నిరాస‌ప‌రిస్తే క‌ష్ట‌మే. సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందేమో. శ్ర‌ద్ధా కోసం వీడియోని రిలీజ్ చేసినా అందులో కాంబినేష‌న్ సీన్ లేకుండా ఉంటే ఎలా? అన్న నిరాశ అభిమానుల్లో త‌ప్ప‌దు. మ‌రి దాని గురించి అయినా ఆలోచిస్తారేమో చూడాలి. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగ‌స్టు 15న ఈ చిత్రం రిలీజ‌వుతోంది.
    

Tags:    

Similar News