ప్రేక్షకులను నిరాశపరిచిన వీకెండ్!!

Update: 2016-08-14 05:31 GMT
సాదారణంగా సంక్రాంతి వంటి పెద్ద పెద్ద పండగల సమయాల్లో తప్ప మిగిలిన అన్ని వారాల్లోనూ ప్రతిశుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. శుక్రవారం - శనివారం - ఆదివారం ఇలా ఈ మూడు రోజుల్లోనూ వారాంతాపు అవకాశంలో భాగంగా సినిమాలు క్యాష్ చేసుకుంటాయి. ఈ సినిమాలు ఏమాత్రం కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఈ మూడురోజుల్లో కలెక్షన్లకు ఏమాత్రం కొదవ ఉండదు. అనంతరం సోమవారం నుంచి గురువారం వారకూ కూడా ఈ కలెక్షన్స్ సపోర్ట్ చేస్తాయి. అయితే తాజాగా ఈ వారాంతం విడుదలయైన నాలుగుసినిమాలు ఈ విషయంలో సక్సెస్ అయ్యాయా లేదా అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.

ఈ వారాంతంలో విడుదలయిన "బాబు బంగారం" సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే! విక్టరీ వెంకటేష్ కం బ్యాక్ ఫిల్మ్ గా ప్రచారం జరగడంతో పాటు - ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందని అంతా భావించారు. కానీ.. ఆ స్థాయిలో ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. అనంతరం ఒకరోజు తేడాలో విడుదలయిన "తిక్క" సినిమాపై కూడా అంచనాలు ఎక్కువగా ఉండి ఉన్నాయి. వరుస హిట్ లతో దూసుకుపోతున్న మెగా మేనళ్లుడు సాయిధరం తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందనే చెబుతున్నారు. ఈ వారాంతంలో ఆగస్టు 15 - సోమవారం కావడంతో.. ఆ మూడు రోజులకు ఇది కూడా తోడయ్యింది. ఈ సమయంలో ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ టాక్ తెచ్చుకున్నా... కలెక్షన్స్ వర్షం కురిసి ఉండేది.

ఇదే సమయంలో భారీ అంచనాల నడుమ విడుదలయిన బాలీవుడ్ సినిమాలు "రుస్తుం" - "మొహంజిదారో" సినిమాలు కూడా యావరేజ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రంగా "రుస్తుం"పై భారీ అంచనాలు నెలకొన్నా.. వాటిని ఆ సినిమా చేరుకోలేదనే చెబుతున్నారు. ఇక హృతిక్ మొహంజిదారో కూడా అదేరీతిలో కొనసాగిందనేది కూడా వాస్తవమే. దీంతో ఈ వారం విడుదలయిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయనే అనుకోవాలి. ఈ క్రమంలో "పెళ్లిచూపులు" సినిమాకు ఈ విషయం కచ్చితంగా పెద్ద బూస్టే అనేది సినీపండితుల అభిప్రాయంగా ఉంది!
Tags:    

Similar News