మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీజర్ రిలీజైంది. ఈ టీజర్ రాజా ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. రవితేజ శైలి మాస్ అంశాలను ఎలివేట్ చేస్తూనే వైవిధ్యంగా ఎలివేట్ చేయడం చర్చకు వచ్చింది. రవితేజ ఫ్లాపుల ట్రాక్ వల్ల అంతగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ టీజర్ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. టీజర్ ఆసక్తిని పెంచిందన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. మాస్ రాజా ఈసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాడా? అన్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా డిస్కోరాజా టీజర్.. వెంకీమామ.. ప్రతీరోజు పండగే చిత్రాల ట్రైలర్లను డామినేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆ రెండు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ మూడింటిలో ది బెస్ట్ ఏదంటే డిస్కోరాజాకే నెటిజనులు ఓటేస్తున్నారు. ఆ రెండు సినిమా ట్రైలర్లను డిస్కోరాజా టీజర్ తో పొలుస్తూ రాజాతోనే కిక్కు దొరికిందన్న వాదన వినిపిస్తోంది. టీజర్ లో ప్రతి సెకెను మాస్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. రాజాకి ఉన్న మాస్ ఫాలోయింగ్ అదనంగా కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో డిస్కోరాజా టీజర్ పైచేయి సాధిస్తోంది.
జస్ట్ .. ఓ టీజర్ తోనే ఈ రేంజ్ లో మెప్పించాడంటే? ట‌్రైలర్ లో అంతకు మించిన ట్రీటిస్తాడనడంలో సందేహం లేదు. డిస్కోరాజా జనవరి 25న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోలు పోటీలో ఉండడంతో రాజా వెనక్కి తగ్గాడు. మరోవైపు వెంకీ మామ, ప్రతీ రోజు పండగే చిత్రాలు ఇదే నెలలో రిలీజ్ కాబోతున్నాయి.