మిసైల్‌' పాతదే.. కొత్తది చెప్పండి

Update: 2015-04-13 15:30 GMT
సడన్‌గా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్‌.. అఖిల్‌ అక్కినేని సినిమా టైటిల్‌ ''మిసైల్‌'' అంటూ ఓ న్యూస్‌ వచ్చింది. అయితే ఇదే విషయాన్ని యునిట్‌ సభ్యులను అడిగితే నవ్వుతున్నారు. ఎందుకంటే.. అడిగిన క్వశ్చన్‌ ఎన్నిసార్లు అడుగుతారు బాసూ అంటూ వాళ్లకి ఈ టైటిల్‌ న్యూస్‌ కామెడీగా అనిపించింది. దానికి ఓ రీజన్‌ లేకపోలేదు.

నిజానికి వివి వినాయక్‌ డైరక్షన్‌లో అఖిల్‌ చేస్తున్న సినిమా పేరు ''మిసైల్‌'' అంటూ ఎప్పుడో గడిచిన డిసెంబర్‌లోనే వార్తలొచ్చాయి. అప్పుడే దీనిపై స్పందించిన అఖిల్‌-వినాయక్‌ టీమ్‌.. దీన్ని కనీసం వర్కింగ్‌ టైటిల్‌గా కూడా అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్నిసార్లు రూమర్లుగా వచ్చిన టైటిల్సే నిజమవుతుంటాయి. ఎందుకంటే ఇదేదో బాగుందే అనుకుని దానినే పెట్టేసే ఛాన్సుంటుంది. మరి ఆ విధంగా ''మిసైల్‌'' అని కన్‌ఫామ్‌ చేశారా?

అసలు యునిట్‌ సభ్యులందరూ స్పెయిన్‌ బయలుదేరి వెళ్తున్నారు.. అందరూ అక్కడ షూటింగ్‌ చేయాల్సిన కార్యక్రమం గురించి డిస్కషన్లలో మునిగి తేలుతున్నారు కాని ఇంకా టైటిల్‌ గురించా మాత్రం పెద్దగా క్లారిటీకి రాలేదట. మరి రూమర్‌ మిసైళ్ళు నిజమవుతాయో, లేకపోతే ఇవి ఉత్తుత్తి దీపావళి తారాజువ్వల్లా నేలకిరాలపోతాయో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News