అనంత నిధి కోసం సుధీర్ బాబు 'జటాధర '
సుదీర్ బాబు ఇప్పటికే తన పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. పూర్తిగా న్యూ లుక్ తో నెవ్వర్ బిఫోర్ అనే ఫిట్నెస్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా ప్రేక్షకులకు మరో విభిన్నమైన అనుభూతిని ఇవ్వడానికి సుధీర్ బాబు మరో ప్రయోగంతో రాబోతున్నాడు. అతని కొత్త సినిమాకు జటాధర అనే టైటల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను జీ స్టూడియోస్ బాలీవుడ్ నిర్మాణ సంస్థలకు పేరుగాంచిన ప్రెర్నా అరోరా గ్రాండ్ గా నిర్మించనున్నాయి. ఇంతకుముందు బాలీవుడ్‌లో రుస్తమ్, ప్యాడ్‌మ్యాన్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రెర్నా అరోరా, ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించడం విశేషం.
సుదీర్ బాబు ఇప్పటికే తన పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. పూర్తిగా న్యూ లుక్ తో నెవ్వర్ బిఫోర్ అనే ఫిట్నెస్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కథాంశం అనంత పద్మనాభస్వామి ఆలయ నేపథ్యంతో సాగనుందని సమాచారం. ఆలయంలో దాగి ఉన్న నిధులు, విభిన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక పరిణామాల చుట్టూ కథ నడవనుందట.
భారతీయ చరిత్ర పౌరాణిక అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా కథ మాత్రమే కాకుండా దాని కథన విధానం కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉండనుందని అంటున్నారు. జీ స్టూడియోస్ సీఈఓ ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఇది భారత చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన కోణాలను, పౌరాణిక విశేషాలను వెలుగులోకి తీసుకువస్తుందని చెప్పారు.
జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పరచింది. సినిమాలో సాంకేతిక నిపుణుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నా, చిత్రబృందం ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది.
జటాధర తెలుగు సినీ పరిశ్రమలోనే నెవ్వర్ బిఫోర్ అనేలా ఉందనున్నట్లు తెలుస్తోంది. సుదీర్ బాబు, తన పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవడం సినిమా విజయం కోసం ఆయన పెడుతున్న కృషిని తెలియజేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్‌డేట్స్ అందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మొత్తం మీద, జటాధర సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులకు, అలాగే పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేయబోతోంది. త్వరలో విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నట్లు సమాచారం.