రామ్ పోతినేని ఫ్యాన్ ఫాలోయింగ్.. ఏ రేంజ్ లో ఉందంటే..
అదే తరుణంలో మరో యువ నటి శ్రీ సత్య కూడా రామ్ పోతినేనిపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, తన సినీ ప్రయాణం కూడా రామ్‌ను చూసే మొదలైందని తెలిపారు.
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు పొందిన రామ్ పోతినేని, తన యూత్‌ఫుల్ లుక్స్, డైనమిక్ నటనతో ఫ్యాన్స్ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ముఖ్యంగా, లేడీస్ లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇద్దరు టాలీవుడ్ ముద్దుగుమ్మలు రామ్ పోతినేనిపై తమ అభిమానాన్ని బహిరంగంగా ప్రకటించడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
'బేబీ' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైష్ణవి చైతన్య, రామ్‌కు ఫ్యాన్‌గా తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. అదే తరుణంలో మరో యువ నటి శ్రీ సత్య కూడా రామ్ పోతినేనిపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, తన సినీ ప్రయాణం కూడా రామ్‌ను చూసే మొదలైందని తెలిపారు. ఈ కామెంట్స్ తో రామ్ అందరికి నచ్చే నటుడని రుజువు చేశాయి.
కెరీర్ ప్రారంభంలో రామ్ రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అయితే, ఆ తరువాత కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ యాక్షన్ రోల్స్‌పై దృష్టి పెట్టారు. అయినప్పటికీ, రామ్‌పై మహిళా ప్రేక్షకుల అభిమానంలో ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడం విశేషం. కొత్త తరం నటీమణులూ ఆయన నటనకు, వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతున్నారు అంటే, రామ్‌లో ఉన్న ప్రత్యేకతే ఇందుకు కారణం.
ప్రస్తుతం రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ RAPO22 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు పి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ ఒక స్టార్ కు అభిమానిగా కనిపించనున్నారు.
ఇక రామ్ పోతినేనికి ఈ స్థాయి గుర్తింపు రావడానికి కారణం అతని టాలెంట్, స్టన్నింగ్ లుక్స్, అలాగే అభిమానులతో ఉండే ప్రత్యేక బంధం. ఫ్యాన్స్‌కు థియేటర్‌లో సినిమా చూసే అనుభూతిని ఆయన ప్రతీ సారీ కొత్తగా అందిస్తారు. ఇప్పుడు ఆయన హీరోగా కాకుండా, ఒక ఫ్యాన్‌గా కనిపిస్తే అది ప్రేక్షకులకు మరింత కొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు..ఈ చిత్రంతో రామ్ తన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేస్తారని, అలాగే ఫ్యాన్స్ కు ఒక సర్ ప్రైజ్ ఇస్తారని టాక్.