‘కేశవ’లో ఆ క్లారిటీ ఎందుకు మిస్సయిందంటే..

Update: 2017-05-21 04:38 GMT
ఈ వీకెండ్లో వచ్చిన కొత్త సినిమా ‘కేశవ’ అదరగొడుతోంది. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. కేశవలో చెప్పుకోవడానికి చాలా పాజిటివ్ పాయింట్లే ఉన్నాయి. అలాగే కొన్ని నెగెటివ్స్ కూడా లేకపోలేదు. ఈ కేటగిరిలో జనాలు చెబుతున్న ముఖ్య విషయం.. హీరోకు కుడివైపున గుండె ఉండటం వల్ల అతడికి ఎదురయ్యే సమస్యల గురించి పెద్దగా  స్ట్రెస్ చేసింది లేదని.. ట్రైలర్లో ఆసక్తి రేకెత్తించిన ఈ అంశాన్ని దర్శకుడు సుధీర్ వర్మ సరిగా ఉపయోగించుకోలేదని.. దీని చుట్టూ నెలకొన్న హైప్ కు తగ్గట్లుగా సినిమాలో సన్నివేశాలు లేవని అంటున్నారు జనాలు. ఐతే దీనికి సంబంధించి సినిమాలో కొన్ని సన్నివేశాలు తీశారట. కానీ అవి తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందట.

హీరో హత్యలు చేసే ముందు ఓ పరికరం పెట్టుకుని తన హార్ట్ బీట్ చెక్ చేసుకుంటాడట. హార్ట్ బీట్ పెరుగుతున్నపుడు గమనించి.. ఆ సమయంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇళయరాజా పాటలు విని సాధారణ స్థితికి వచ్చి.. అప్పుడు హత్య చేసేలా చూపించారట. తనను ఎవరైనా అనుమానంగా చూసినపుడు కూడా అతడి హార్ట్ బీట్ పెరిగి.. వెంటనే పాటలు వినేలా కూడా ఒకట్రెండు సన్నివేశాలు తీశారట. ఐతే సినిమా నిడివి ఎట్టి పరిస్థితుల్లోనూ 2 గంటల్లోపు ఉండాలని పట్టుబట్టి.. దర్శకుడు సుధీరే ఆ సన్నివేశాలకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెర వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఆ సన్నివేశాలు కొనసాగించి ఉంటే సినిమా మరింత బెటర్ గా అనిపించేదేమో. అయినప్పటికీ ‘కేశవ’కు వేరే ఆకర్షణలు చాలానే ఉండటంతో సినిమా మంచి వసూళ్లతో సాగిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News