పోయినేడాది ‘సరైనోడు’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ కౌంటరివ్వడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. అప్పట్నుంచి పవన్ అభిమానులకు అతడికి మధ్య అగాథం మొదలైంది. అది క్రమ క్రమంగా పెరిగి పెద్దదైంది. తర్వాత మరో వేడుకలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బన్నీ విషయంలో పవన్ అభిమానుల వ్యతిరేకత తగ్గలేదు. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు పెట్టే కామెంట్లూ అవీ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. తాజాగా ‘ఒక్క క్షణం’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇదే తరహాలో చర్చనీయాంశమవుతున్నాయిప్పుడు.
స్టేజ్ మీద ఎవరైనా మాట్లాడుతున్నపుడు అరిచి గోల చేయడం సంస్కారం కాదంటూ బన్నీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలా అన్నవాడు మళ్లీ చివర్లోకి వచ్చేసరికి తన పేరుతో ఉన్న టీషర్టులు వేసుకున్న అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ ఈ వేడుకను విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ అనడం ఆశ్చర్యం కలిగించింది. ఇది హిపోక్రసీ కాదా అంటూ బన్నీ వ్యతిరేకులు సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలుపెట్టారు. అతను గతంలో చేసిన పవన్ అభిమానుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని.. ఇప్పటి వ్యాఖ్యల్ని పోల్చి చూపిస్తూ బన్నీ ద్వంద్వ ప్రమాణాల్ని ఎత్తి చూపిస్తున్నారు.