ఫోటో స్టోరి: బికినీ ఏదైనా కిక్కివ్వ‌డంలో దిశా త‌ర్వాతే

Update: 2022-11-12 15:33 GMT
హిందీ చిత్ర‌సీమ‌లో ఎంత పోటీ ఉన్నా క్రేజీ నాయిక‌గా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంది దిశా పటానీ . చేసిన‌వి కొన్ని సినిమాలే అయినా యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ సంపాదించింది. ముఖ్యంగా దిశా సోష‌ల్ మీడియా క్వీన్ గా ఏల్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ భారీగా అభిమానులను సంపాదించుకుంది. దిశా తరచుగా ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ఇన్ స్టాలో తన అద్భుతమైన బికినీ ఫోటోల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. దిశా ప‌ర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఫ్రీక్. అద్భుతమైన టోన్డ్ ఫిజిక్ తో కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొడుతోంది. తరచుగా బికినీలు మోనోకినీల్లో ఆకర్షణీయమైన శరీరాన్ని ప్రదర్శిస్తుంది.

తాజాగా దిశా ఇన్ స్టాగ్రామ్ లో హాటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఈ ఫోటోలలో చీటా ప్రింటెడ్ డిజైన్ తో ఎరుపు రంగు బికినీ ధరించి కనిపించింది. ఈ న‌యాలుక్ లో దిశా టూ హాట్ గా క‌నిపిస్తోంది. ఈ పోస్ట్ కు క్యాప్షన్ కూడా ఇవ్వ‌లేదు. కేవ‌లం ఈ బికినీ రూపం చాలు వైర‌ల్ గా దూసుకెళ్ల‌డానికి... త‌న ఆత్మ‌విశ్వాసాన్ని ఇనుమ‌డింప‌జేయ‌డానికి.

ఇన్ స్టాగ్రామ్ లో దిశా పటానిని అనుసరిస్తే అద్భుతమైన స్విమ్ సూట్ కలెక్షన్ గురించి నేటిత‌రానికి అవ‌గ‌త‌మ‌వుతుంది. వార్డ్ రోబ్ లో పర్ఫెక్ట్ బీచ్ వేర్ ఎంపిక ఎలా అన్న‌దానికి సొల్యూష‌న్ దిశా ఎంపిక‌లే. యానిమ‌ల్ ప్రింటెడ్ స్విమ్ సూట్ ల నుండి వన్-షోల్డర్ బికినీ టాప్స్ ఆఫ్-షోల్డర్ మోనోకినీల వరకు ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని ఆవిష్క‌రిస్తూనే ఉంటుంది.

ఈసారి యానిమ‌ల్ ప్రింటెడ్ బికినీతో అద‌ర‌గొట్టింది.  ఈ బికినీకి పూల లాకెట్టుతో కూడిన అందమైన చైన్ తో యాక్సెసరైజ్ చేసింది. న్యూడ్ లిప్ షేడ్ ఎరుపెక్కిన‌ బుగ్గలతో మేకప్ లెస్ రూపంలో ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దిశా పటాని చివరిగా ఏక్ విలన్ రిటర్న్స్‌లో అర్జున్ కపూర్- తారా సుతారియా - జాన్ అబ్రహంలతో కలిసి కనిపించింది. తదుపరి సూర్య స‌ర‌స‌న సూర్య 42లో న‌టించ‌నుంది.  శివ దర్శకత్వంలో ఈ 3డి చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. లైన‌ప్ లో యోధా- ప్రాజెక్ట్ K ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌వి. న‌టిస్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా రేంజులోనే విడుద‌ల కానున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News