ఫోటో స్టోరి: గ్లామర్ అలా పంచింది

Update: 2017-11-18 05:36 GMT
బాలీవుడ్ భామ దిశా పాట్నీ డ్రీమ్స్ బాగా హై రేంజ్ లో ఉంటున్నాయి. స్టార్ హీరోల సరసన మినహాయిస్తే.. తను హీరోయిన్ గా నటించబోనని తెగేసి చెప్పేస్తోంది కూడా. అలాగని ఈమె ఖాతాలో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయా అంటే అదేమీ లేదు. పోనీ ఏ స్టార్ కి వారసురాలు కూడా కాకపోవడంతో.. ఆ స్థాయి ఆఫర్స్ రావడం కష్టంగానే ఉంది.

అయితే.. తన టార్గెట్ తగినట్లుగా ప్రయత్నాలు చేయడంలో మాత్రం దిశా ఎక్కడా తగ్గడం లేదు. తను ఏ స్థాయిలో గ్లామర్ పండిచగలదో ఇండస్ట్రీ జనాలకి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. తాజాగా మాగ్జిమ్ ఇండియా కోసం ఓ ఫోటో షూట్ చేసింది ఈ భామ. తన సోషల్ మీడియా పేజ్ లో ఇందుకు సంబంధించిన ఓ పిక్ ను షేర్ చేసింది. డిజైనర్ డెనిమ్ షార్ట్.. బ్లాక్ టాప్ లో ఓ పక్కకు తిరిగి కూర్చున్న దిశా.. ఈ ఫోటోలో మనకు దర్శనం ఇస్తుంది. నడుము ఒంపుల నుంచి ప్రతీ పాయింట్ లోనూ తన గ్లామర్ ను ఎంతవరకూ పంచగలదో అంతవరకూ ఎగ్జిబిట్ చేసింది దిశా పాట్నీ.

ఓ పక్కగా వాలిన కురులు.. కొంచెం మేకప్ తో కనిపిస్తున్న ఫేస్.. అన్నిటికీ మించి చూపులతో మత్తెక్కించేందుకు భామ చేస్తున్న ప్రయత్నం.. చూపరులను తెగ ఆకట్టుకోవడం ఖాయం. టార్గెట్ ను బాగా హై లెవెల్ లో సెట్ చేసుకున్న దిశా పాట్నీ.. అందుకోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఎప్పటికి లక్ష్యాన్ని అందుకుంటుందో ఈ లోఫర్ బ్యూటీ.
Tags:    

Similar News