టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ పై బిగ్ పంచ్

Update: 2019-01-18 14:30 GMT
సంక్రాంతి సినిమాలు ఆశ్చర్య‌క‌ర‌మైన రిజ‌ల్టుని ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. న‌మ్మి కోట్ల‌కు కోట్లు పెట్టుబ‌డి పెడితే చివ‌రికి పంపిణీ దారుల‌కు తీవ్ర‌ న‌ష్టాలు త‌ప్ప‌డం లేదుట‌. బ‌యోపిక్ కేట‌గిరీలో వ‌చ్చిన `క‌థానాయ‌కుడు` చిత్రాన్ని న‌మ్మి పెట్టుబ‌డులు పెట్టిన‌  నిర్మాత కం డిస్ట్రిబ్యూట‌ర్ సాయికొర్ర‌పాటికి న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌న్న‌ టాక్ వినిపిస్తోంది.

మొన్న‌నే క‌న్న‌డ సినిమా కెజిఎఫ్ తో హిట్టు కొట్టినా, సంక్రాంతి బ‌రిలో క‌థానాయ‌కుడు నెగెటివ్ ఫ‌లితాన్ని ఇచ్చింది.  క‌థానాయ‌కుడు చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన సాయి కొర్ర‌పాటి వైజాగ్, సీడెడ్, కృష్ణ‌, క‌ర్ణాట‌క‌లోనూ రిలీజ్ చేశారు. ఆ మేర‌కు నిర్మాత‌గా, పంపిదారుడిగా బిగ్ పంచ్ త‌ప్ప‌డం లేద‌ట‌. దాదాపు 70 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోవ‌డంతో చాలా ఏరియాల పంపిణీదారుల్లో ఆందోళ‌న నెల‌కొంద‌న్న మాటా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మొద‌టి భాగం ఫ‌లితం వ‌ల్ల‌, త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతున్న `మ‌హానాయ‌కుడు` స‌న్నివేశమేంటో అర్థం కాని ప‌రిస్థితి నెలకొంద‌న్న చర్చా  సాగుతోంది. మ‌హానాయ‌కుడు చిత్రం తొంద‌ర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నందున ఆ సినిమాపైనే పంపిణీదారులు ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నారు. `మ‌హాన‌టి` త‌ర‌హా ఘ‌న‌విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆశిస్తే ఊహించ‌ని విధంగా రిజ‌ల్ట్ రాక‌పోవ‌డంపై ట్రేడ్ లో అంతా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. అన‌వ‌స‌ర హైప్ తో పంపిణీ వ‌ర్గాలు భారీ ధ‌ర‌లకు కొనుక్కోవ‌డం వ‌ల్ల న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ట‌. సినిమా బావుంద‌ని టాక్ వ‌చ్చినా, జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింద‌ని విశ్లేషిస్తున్నారు.




Full View

Tags:    

Similar News