నైట్ గౌనులో టోన్డ్ లెగ్స్ తో గుబులు పుట్టిస్తోంది!

Update: 2022-06-14 06:34 GMT
దివి వ‌ద్య‌త ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ సీజ‌న్ 4లో వేడెక్కించే పెర్ఫామెన్స్ తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లింది ఈ తెలుగ‌మ్మాయ్. త‌న‌దైన అందం క‌వ్వింత‌తో దివి యువ‌త‌రానికి పిచ్చిగా న‌చ్చేసింది. ఇక దివి అంద‌చందాల‌కు ప్ర‌తిభ‌కు మంత్ర‌ముగ్ధులైన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌తో సినిమాలు చేస్తున్నారు. కొంద‌రు వెబ్ సిరీస్ ల‌లోనూ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ దివి చాలా బిజీ సంపాద‌కురాలిగా ఉంది.

బిగ్ బాస్ వేదిక ద్వారా ప‌రిచ‌య‌మైన ఇత‌ర భామ‌ల కంటే దివి కాస్త స్పీడ్ గానే ఉంది. దివి ఇంత‌కుముందే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. ఈ అమ్మడి అంద‌చందాలు న‌ట‌న యూత్ కి మ‌త్తెక్కించాయి.

మునుముందు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు సినిమాల్లో మంచి అవ‌కాశాలు వెతుక్కుంటూ రానున్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ - 2020 జాబితాలో దివి అగ్ర ప‌థాన నిలిచి మ‌రోసారి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంది.

దివి వ‌ద్య‌త‌కు సోష‌ల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా మాధ్య‌మంగానూ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ద‌ర్శ‌న‌మిస్తోంది.  దివి వ‌ద్య‌త లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. శాటిన్ క‌ల‌ర్ నైట్ గౌనులో దివి తాజా లుక్ హీటెక్కిస్తోంది.

థై స్లిట్ నైట్ గౌనులో దివి ఒంపుసొంపులు టోన్డ్ లెగ్స్ వ‌య్యారం బ‌య‌ట‌ప‌డింది. మిరుమిట్లు గొలిపే శాటిన్ గౌనులో టూ హాట్ గా ఉందంటూ దివికి కితాబిచ్చేస్తున్నారు. అభిమానులు ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

అన్న‌ట్టు.. ఇంత‌కుముందు బిగ్ బాస్ షోలో చిరంజీవి- నాగార్జున లాంటి స్టార్లు త‌మ సినిమాల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని మాటిచ్చారు. త‌దుప‌రి చిత్రాల‌లో ఈ బ్యూటీకి చోటుంటుందేమో చూడాలి. దివి వద్య‌త హైద‌రాబాద్ షేక్ పేట‌లోని నారాయ‌ణ‌మ్మ కాలేజ్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
Tags:    

Similar News