అల్లు అర్జున్ మూవీ డీజే- దువ్వాడ జగన్నాధం మూవీ రిలీజ్ కు మరో రెండు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ టాప్ లెవెల్ కి తీసుకెళ్లిపోయిన డీజే టీం.. మరోవైపు వివాదానికి చెక్ పెట్టేసుకుంటున్నారు. ఈ మూవీలోని గుడిలో బడిలో పాటలో ఉపయోగించిన పదాలపై బ్రాహ్మణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
నమకం.. చమకం పదాలను ఉపయోగిస్తూ రుద్ర స్తోత్రాన్ని అవమానించారని డీజే యూనిట్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసును హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది. దీంతో విడుదలపై ప్రభావం పడుతుందని భావించిన నిర్మాత దిల్ రాజు.. పాటను మార్చేందుకు నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే పాటలోని పదాలను మార్చుతామంటూ దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పాడు. ఇప్పుడు నమకం- చమకం పదాలను.. నా గమకం.. నీ సుముఖం పదాలతో రీప్లేస్ చేసి కొత్త పాటను కూడా సిద్ధం చేసేశారు.
కొత్త పాటతో ఫైనల్ కాపీని సెన్సార్ బోర్డుకు సమర్పించినట్లు నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. కొత్త పాటను త్వరలో యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని.. ఇకపై విడుదల చేసే ఆడియో ఆల్బంలో కూడా కొత్త పాటే ఉంటుందని ఆయన చెప్పారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. విడుదల విషయంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా.. ముందుగానే కాంప్రమైజ్ అయిపోయింది డీజే యూనిట్.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/