`అహింస` నినాదంతో భారతదేశ స్వాతంత్య్ర సమరంలో పోరాడిన అసాధారణ నాయకుడిగా మహాత్మాగాంధీకి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీకి గౌరవం గుర్తింపు ఫాలోయింగ్ ఉన్నాయి. గాంధీజీ జీవిత చరిత్రపై పలు చిత్రాలు విడుదలై ఆకట్టుకున్నాయి. గాంధీజీ పాత్రల్ని తమ సినిమాల్లో క్రియేట్ చేసేందుకు తెలుగు దర్శకులు ఆసక్తిని కనబరిచారు.
గాంధీ- గాంధీ మై ఫాదర్- ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ- ది గాంధీ మర్డర్- హమ్ నే గాంధీకో మార్ దియా- నాను గాంధీ- హే రామ్ .. ఇలా ఎన్నో సినిమాల్లో గాంధీజీ పాత్రలను దర్శకులు సృజించారు. అవన్నీ ఆసక్తిని కలిగించాయి. పలు రాజకీయ నేపథ్యం ఉన్న హిందీ చిత్రాల్లో గాంధీజీ పాత్రలు మెప్పించాయి.
ఇటీవల `ది బిగ్ బుల్` ఫేం ప్రతీక్ గాంధీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ పాత్రలో నటించాక ప్రతీక్ తన కెరీర్ లో అత్యుత్తమ OTT షోలు చిత్రాలను చేస్తున్నాడు. మహాత్మా గాంధీ పాత్రలో ప్రతీక్ నటించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తాజాగా ఖరారైంది.
మీడియా కథనాల ప్రకారం.. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రచించిన `గాంధీ`పై అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్న ఓ రెండు పుస్తకాల హక్కులను అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ భారీ మొత్తాన్ని చెల్లించి ఛేజిక్కించుకుందని తెలిసింది. ఈ పుస్తకాల ఆధారంగా త్వరలోనే ఓ వెబ్ సిరీస్ ని నిర్మించనున్నారని తెలుస్తోంది.
గాంధీజీ ప్రారంభ రోజుల నుండి దక్షిణాఫ్రికాలో అతని చర్యల వరకు... అలాగే భారతదేశంలోని స్వాతంత్య్ర సమరం వరకు యువ గాంధీని మహాత్ముడిగా రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అతని జీవితంలో అంతగా తెలియని కథలను ఈ సిరీస్ తెరపై ఆవిష్కరించనుందని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ బాలీవుడ్ తారలు కీలక పాత్రలు పోషించనున్నారు.
మూవీ టీవీ నటీనటులు ఇందులో నటిస్తారని సమాచారం. నిజానికి మహాత్మ గాంధీజీపై నేటితరానికి తెలిసింది చాలా తక్కువ. పుస్తకాలు చదివే అలవాటు అంతరించిన ఈ యుగంలో.. విజువల్ మీడియంపై ఆధారపడుతున్న నేటి జనరేషన్ కి ఇలాంటి సిరీస్ చాలా ఇన్ఫర్మాటిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.