ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కైకాల సత్యనారాయణ చిన్న కుమారుడు కేజిఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు ఫోన్ చేసి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి గత నవంబర్ లోనే వాకబు చేసిన సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్న జగన్.. ప్రభుత్వం తరపున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక ఐఏఎస్ అధికారి వచ్చి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అని వాకబు చేసారు. మెరుగైన చికిత్స చేయాలని ఆస్పత్రి వైద్యులను కోరారు.
కైకాలకు రాజకీయ నాయకులతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అదే క్రమంలో పలువురు ఆయ ఆరోగ్యం గురించి వాకబు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మచిలీపట్నం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్న బాబుతో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు రావు రమేష్ కైకాల ఆరోగ్యం గురించి ఫోన్ చేసి వాకబు చేయగా కన్నడ సూపర్ స్టార్ యష్.. మరో స్టార్ శివ రాజ్ కుమార్ కూడా చినబాబుకు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేసి ఆయనకు ఏమీ కాదని మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇక కైకాల ప్రస్తుతం కోలుకుంటున్నారని ఎలాంటి ఇబ్బంది లేదని దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు అప్పట్లో కోరారు. కానీ అప్పటికే మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ ప్రచారం సాగింది.
కైకాల హైదరాబాద్ లోని ప్రయివేట్ హాస్పిటల్ లో సుదీర్ఘ కాలం చికిత్స పొందారు. కైకాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్ లో చేరిన సమయం నుంచి మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పిటల్ వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ప్రతిరోజూ రెండు పూటలా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన స్పృహలో ఉన్నారా? లేదా? ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంది? వంటి అవకాశాల గురించి డాక్టర్ లతో చిరు సంప్రదింపులు జరిపారు.
కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తాను మాట్లాడిన తర్వాత థమ్సప్ (సింబల్ ) చూపించారని కూడా ముందుగా చిరంజీవి మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కైకాల సత్యనారాయణ కుటుంబానికి అన్ని తానే అయి హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతూ కైకాల కుటుంబ సభ్యులకు చిరంజీవి ధైర్యం చెప్పారు. అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో తమకు ఇంతలా ఒక అండగా నిలబడిన చిరంజీవికి కైకాల కుటుంబ సభ్యులు ఋణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ- మోహన్ బాబు కూడా కైకాల కుమారుడు చినబాబుకు ఫోన్ చేసి తండ్రి గారి ఆరోగ్యం గురించి వాకబు చేశారని కథనాలొచ్చాయి. కేవలం ఈ రెండు మూడు నెలల్లోనే ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయన తన ఇంట్లో కాలు జారి పడిపోయిన అనంతరం వయసు రీత్యా అది తీవ్ర పరిణామాలకు దారి తీసిందని చెబుతున్నారు. ఆ తర్వాత వెంటిలేటర్ పై చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది. నేటి(23డిసెంబర్) తో ఆయన నిష్కృమణం సినీరాజకీయ వర్గాల్లో ఎందరినో కలచివేస్తోంది. పరిశ్రమ ఈ వార్తను జీర్ణించుకోలేని స్థితిలో ఉంది. కైకాల మరణానంతరం సెలబ్రిటీ సోషల్ మీడియాల్లో సంతాపం పోటెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఒక టాప్ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ కైకాలకు ఉందని ఇది నిరూపిస్తోంది.
మూడు రాజధానులకు అండగా .. సీఎం జగన్ తో కైకాల అనుబంధం గొప్పది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం చర్చల్లో నలుగుతున్న క్రమంలో సినీపరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ వెటరన్ నటుడు కైకాల సత్యనారాయణ ఎంతో గట్సీగా నేరుగా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఓ ప్రముఖ మీడియా సమక్షంలో కొనియాడారు. ఈ విషయంలో ఆయన ధైర్యం చొరవ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రకటనకు ముందు నుంచి కూడా సీఎం జగన్ తో ఆయన కుటుంబంతో కైకాలకు అనుబంధం ఉందని చెబుతారు.
కైకాల ఆనోరోగ్యం గురించి తెలుసుకుని సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇప్పుడు కైకాల మరణ వార్త విని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడు కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని తెలిసింది. అయితే దీనిని అధికారికంగా ఏపీ సీఎంవో ధృవీకరించాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.