కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. అఫీషియల్ గా మాత్రమే లాక్ డౌన్ అనౌన్స్ కాలేదు. కానీ.. అన్ని రంగాలపై తీవ్రంగా ఎఫెక్ట్ పడింది. ఇక, సినిమా రంగం గురించి చెప్పాల్సిన పనేలేదు. థియేటర్లు ఎప్పుడో మూతపడ్డాయి. సినిమా షూటింగులు కూడా దాదాపుగా నిలిపేశారు. ఒకటీ రెండు చిత్రాలు మాత్రం కరెంట్ షెడ్యూల్స్ ను కంటిన్యూ చేస్తున్నాయి. అవి ఫినిష్ అవగానే.. ఆ సినిమా షూటింగులు కూడా ఆగిపోనున్నాయి.
దీంతో.. అందరూ ఇళ్లకే పరిమితమైపోతున్నారు. బయటకు వచ్చేందుకు అవకాశమే లేకపోవడంతో.. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక, పలువురు సినీ ప్రముఖులు ఈ గ్యాప్ లోనే పెళ్లి పీటలు కూడా ఎక్కేస్తున్నారు. ఇంత గ్యాప్ మళ్లీ దొరుకుతుందో లేదోనని అతి కొద్ది మంది సమక్షంలో ‘మమ’ అనేస్తున్నారు.
అయితే.. ఈ ఖాళీ టైమ్ ను హీరోలు ఎలా పాస్ చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. అందరి సంగతి దశలవారీగా చూద్దాం. ఇప్పుడు మాత్రం సాయిధరమ్ తేజ్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరి అయిన సాయి తేజూ.. ‘ప్రతిరోజూ పండగే’తో మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ‘సోలో బతుకే సో బెటర్’కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు మంచి మంచి కథలు వెతికే పనిలో పడ్డాట. పలువురు దర్శకులు చెప్పే స్టోరీలను తీరిగ్గా వింటున్నాడట. కేవలం తెలుగు దర్శకుల స్టోరీస్ మాత్రమే కాకుండా.. తమిళ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నాడట.
ఇప్పటికే దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన స్క్రిప్టు విన్నాడని సమాచారం. మరికొందరు డైరెక్టర్స్ కూడా లైన్లో ఉన్నారట. ఈ విధంగా.. కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడట సాయి. ఇప్పటికైతే.. ‘రిపబ్లిక్’ మూవీ రిలీజ్ కు సిద్దంగా ఉంది. కరోనా గోల తగ్గిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత.. ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.