ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ అతడి మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య పరువు నష్టం కేసుల్లో కోర్టు తీర్పు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్యపై నెగ్గిన ఘటికుడిగా జానీ డెప్ విజయాన్ని ప్రపంచం కొనియాడింది. అతడికి ఇండియాలోనూ ఉన్న అసాధారణ ఫాలోవర్ల గురించి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖుల్లో పలువురు అతడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఇప్పుడు సదరు ఆలుమగల కలతలు గొడవలపై ఓ డాక్యు సిరీస్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
జానీ డెప్ - అంబర్ హర్డ్ పరువు నష్టం విచారణపై రెండు-భాగాల డాక్యుమెంటరీ తెరకెక్కనుంది. డిస్కవరీ+ U.K దీనిని సీక్వెల్ కథాంశంతో రెండవ సీజన్ ను రూపొందిస్తోంది. ఇది మాజీ జంట జానీ డెప్ - అంబర్ హర్డ్ మధ్య పరువు నష్టం దావా ఆధారంగా తెరకెక్కుతోంది.
ప్రఖ్యాత హాలీవుడ్ వెబ్ సైట్ వెరైటీ కథనం ప్రకారం.. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్లస్ U.K ఇంతకుముందే 'జానీ వర్సెస్ అంబర్' సిరీస్ ని రూపొందించింది. దానికి ఇప్పుడు ఫాలో-అప్ ని రూపొందించడానికి ఆప్టోమెన్ టీవీతో తిరిగి టీమప్ అవుతోంది. ఇది హైకోర్టులో జానీ డెప్ పరువు నష్టం విచారణను విశ్లేషించే రెండు-భాగాల డాక్యుమెంటరీ. తొలి భాగం డాక్యుమెంటరీ విజయం సాధించిన తర్వాత ఈసారి అదే జంట కథను తెరపై చూపిస్తోంది. U.S.లో డెప్ - హర్డ్ మధ్య జరిగిన ఇటీవలి అత్యంత ఉన్నత స్థాయి న్యాయ పోరాటంపై ఫాలో అప్ కథనంలో దృష్టి సారిస్తారు.
రెండు-భాగాల సిరీస్ లో డెప్- హియర్డ్ ఇద్దరి నడుమా వాదోపవాదాలు కోర్టు డ్రామా.. విస్తృతమైన సాక్ష్యాలను తెరపైకి తెస్తారు. ప్రతి ఎపిసోడ్ తో న్యాయ బృందాలు.. స్నేహితులు.. కుటుంబ సభ్యులు .. ముఖ్య సాక్షుల ద్వారా వాదనల కోణంలో దీనిని తెరకెక్కిస్తారు.
మొదటి సీజన్ లో డెప్ ఓడిపోయినట్టు చూపించారు. U.K.లో డెప్- అంబర్ నడుమ కోర్టు గొడవను చూపించారు. అక్కడ కోర్టులో డెప్ ఓటమి పాలయ్యాడు. ఒక న్యాయమూర్తి డెప్ ను వర్ణించడానికి 'వైఫ్ బీటర్' అనే పదం వాడినట్టు ప్రముఖ పబ్లికేషన్ లో ఉపయోగించడం కనిపించింది. డెప్ కోర్టుకు సమర్పించిన దుర్వినియోగానికి సంబంధించిన సాక్ష్యంపై కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు అమెరికాలో జరిగిన విచారణలో కోర్టు డెప్ కి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఇదే కథను కొనసాగింపుగా తెరపై డాక్యు సిరీస్ గా చూపించనున్నారు.
వైఫ్ వేధింపులను తెరపై చూపిస్తారా?
హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ .. అతడి భార్య అంబర్ హెర్డ్ మధ్య పరువు నష్టం తగాదాలో కోర్టు తుది తీర్పులో భార్యపై భర్త నెగ్గడం సంచలనమైంది. ఫిబ్రవరి 2019లో జానీ ఫెయిర్ ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్ట్ లో కనీసం 50 మిలియన్ డాలర్ల పరువు నష్టం కోసం అంబర్ పై దావా వేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2018 ఆప్-ఎడ్ లో ఆమె తనను తాను 'గృహ దుర్వినియోగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పబ్లిక్ ఫిగర్' అని వర్ణిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్ లో రాసింది.
2022 జూన్ 1న డెప్-హెర్డ్ పరువు నష్టం విచారణ ముగింపు దశకు వచ్చింది. డెప్ కు పరిహారం శిక్షాత్మక నష్టపరిహారం కలిపి 15 మిలియన్ డాలర్లను అందజేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. హియర్డ్ తన మాజీని పరువు తీసినందుకు దోషిగా తేలినప్పటికీ ఆమెకు 2 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం కూడా లభించింది. దీనిపై సెలబ్రిటీల్లోనూ హర్షం వ్యక్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జానీ డెప్ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
డెప్ - హర్డ్ ఫిబ్రవరి 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 15 నెలల తర్వాత విడాకుల కోసం హియర్డ్ కోర్టులో కేసును ఫైల్ చేశారు. విడాకులు 2016లో ఖరారు అయ్యింది. పరువు నష్టం కేసులో భార్యపై డెప్ సంచలన విజయం సాధించంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.